Share News

KCR: ఎప్పుడైనా.. ఎవరినైనా.. అరెస్టు చేయవచ్చు!

ABN , Publish Date - Aug 05 , 2025 | 04:45 AM

బీఆర్‌ఎస్‌‌‌పై కాంగ్రెస్‌ పార్టీ కుట్ర పన్నుతోందని, ఇందులో భాగంగా కొంతమంది బీఆర్‌ఎస్‌ నేతలను ఎప్పుడైనా అరెస్ట్‌ చేయవచ్చని, ఎవరూ ఆందోళన చెందవద్దని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పార్టీ శ్రేణులకు సూచించారు.

KCR: ఎప్పుడైనా.. ఎవరినైనా.. అరెస్టు చేయవచ్చు!

  • బీఆర్‌ఎస్‌‌పై కాంగ్రెస్‌ కుట్ర.. ఆందోళన చెందవద్దు

  • ఫాంహౌస్‌‌లో పార్టీ నేతలతో కేసీఆర్‌ సమావేశం

  • కాళేశ్వరం నివేదికపై ఆరున్నర గంటలకుపైగా చర్చ

  • కేటీఆర్‌, హరీశ్‌, జగదీశ్‌, ప్రశాంత్‌ హాజరు

  • దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపు

  • నేడు హరీ్‌షరావు పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌

హైదరాబాద్‌, గజ్వేల్‌, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌‌‌పై కాంగ్రెస్‌ పార్టీ కుట్ర పన్నుతోందని, ఇందులో భాగంగా కొంతమంది బీఆర్‌ఎస్‌ నేతలను ఎప్పుడైనా అరెస్ట్‌ చేయవచ్చని, ఎవరూ ఆందోళన చెందవద్దని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పార్టీ శ్రేణులకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రిపోర్టును పీసీ ఘోష్‌ కమిషన్‌ ప్రభుత్వానికి సమర్పించిన నేపథ్యంలో ఎర్రవల్లిలోని తన ఫాంహౌ్‌సలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డిలతో కేసీఆర్‌ సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు దాదాపు ఆరున్నర గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కాళేశ్వరం కమిషన్‌ రిపోర్టులో ఏముంటుందనేది ముందుగా ఊహించిందేనని, అది కాళేశ్వరం కమిషన్‌ కాదని, కాంగ్రెస్‌ కమిషన్‌ అని కేసీఆర్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ‘‘మనల్ని టార్గెట్‌ చేసినట్లుగా అర్థం అవుతోంది. కాళేశ్వరం కమిషన్‌ రిపోర్టు, ఈ-కార్‌ రేసింగ్‌, ఫోన్‌ ట్యాపింగ్‌ విషయాల్లో ఎప్పుడైనా కొందరిని అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది’’ అని కేసీఆర్‌ అన్నట్లు సమాచారం. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయెజనాలను ప్రజలకు వివరించాలని, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు.


కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రయోజనాలను ప్రజలకు వివరించేలా మంగళవారం తెలంగాణ భవన్‌లో పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇవ్వాల్సిందిగా మాజీమంత్రి హరీ్‌షరావును కేసీఆర్‌ ఆదేశించారు. ఈ ప్రెజెంటేషన్‌ను అన్ని నియోజకవర్గాల్లో బహిరంగంగా ప్రదర్శించాలని పార్టీ ఆదేశించింది. మరోవైపు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో చండీయాగం చేయడం లేదని కేసీఆర్‌ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కాళేశ్వరంపై కక్షగట్టి దాన్ని విఫలంగా చూపే ప్రయత్నం చేస్తున్నారని సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. కమిషన్‌ ఇచ్చిన నివేదిక ఫైనల్‌ కాదని దానిపై కోర్టుకు వెళ్లొచ్చని చెప్పారు. కాళేశ్వరం ఎత్తిపోతలలో మేడిగడ్డలో కుంగింది మూడు పిల్లర్లయితే... మూడు బ్యారేజీలు కూలిపోయాయని ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరం నివేదికపై ఆరోపణలు.. బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం

కవితకు షాక్ ఇచ్చిన కోర్టు

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 05 , 2025 | 04:45 AM