Kavitha: కేంద్రం జనగణన ఇంకెప్పుడు చేస్తుంది?
ABN , Publish Date - Feb 03 , 2025 | 04:54 AM
జనగణన ఇంకెప్పుడు ప్రారంభిస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. కావాలనే కేంద్రం జనగణనను విస్మరిస్తోందంటూ ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

రాష్ట్రంలో 42ు బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్
హైదరాబాద్, ఫిబ్రవరి2 (ఆంధ్రజ్యోతి): జనగణన ఇంకెప్పుడు ప్రారంభిస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. కావాలనే కేంద్రం జనగణనను విస్మరిస్తోందంటూ ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు. జనగణన చేయకపోతే దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో కులగణన ఆధారంగా రూపొందించిన నివేదికను కేబినెట్ సబ్‌కమిటీకి ప్లానింగ్ శాఖ అందించిన నేపథ్యంలో బీసీ సంఘాల ప్రతినిధులతో కవిత తన నివాసంలో సమావేశమయ్యారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఎంతమేరకు పెరుగుతాయన్న అంశంపై చర్చలు జరిపారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని, దీనిపై రాష్ట్రప్రభుత్వం తుదినిర్ణయం ప్రకటించిన తర్వాత కార్యాచరణ రూపొందిస్తామని కవిత వెల్లడించారు.