Kavitha: పుత్రోత్సాహంలో.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..!
ABN , Publish Date - May 20 , 2025 | 05:27 AM
ఆదిత్యా.. నీ చిట్టిచేతిని పట్టుకోవడం నుంచి ఇప్పుడు నువ్వు డిగ్రీపట్టా అందుకోవడం వరకు ఎంత గొప్ప ప్రయాణం’ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్స్ వేదికగా తన పుత్రోత్సాహాన్ని చాటారు.
హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి): ’ఆదిత్యా.. నీ చిట్టిచేతిని పట్టుకోవడం నుంచి ఇప్పుడు నువ్వు డిగ్రీపట్టా అందుకోవడం వరకు ఎంత గొప్ప ప్రయాణం’ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్స్ వేదికగా తన పుత్రోత్సాహాన్ని చాటారు. తన పెద్దకుమారునికి గ్రాడ్యుయేషన్‌కు సంబంధించిన ఫోటోను పోస్ట్ చేశారు.
అమెరికాలోని ఓక్‌ఫారెస్ట్ యూనివర్సిటీ నుంచి తమ పెద్దకుమారుడు ఆదిత్య గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్నాడు. సోమవారం ఆమెరికాలో జరిగిన ఈ కార్యక్రమానికి కవిత, అనిల్ కుమార్ దంపతులు హాజరయ్యారు. ఒక తల్లిగా ఎంతో గర్వపడుతున్నానని, ఎక్కడా లేని ఆనందం కలిగిందని కవిత సంతోషం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
HYD Fire Accident: ఓల్డ్‌సిటీ ఫైర్ యాక్సిడెంట్‌కి కారణం.. స్థానిక అక్రమ కరెంట్ కనెక్షన్లు.!
Gulzar House Fire Incident: గుల్జార్ హౌస్ ప్రమాదంపై ఎఫ్‌ఐఆర్ నమోదు
Hydra Demolitions: హైడ్రా కూల్చివేతలు షూరూ.. టెన్షన్ టెన్షన్
Read Latest Telangana News And Telugu News