Kavitha: హెచ్‌ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగా కవిత
ABN , Publish Date - Sep 02 , 2025 | 04:04 AM
సింగరేణిలోని హింద్ మజ్దూర్ సభ హెచ్‌ఎంఎస్ అనుబంధ సంస్థ సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్...
రాష్ట్ర అధ్యక్షుడిగా రియాజ్ అహ్మద్
శ్రీరాంపూర్, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): సింగరేణిలోని హింద్ మజ్దూర్ సభ (హెచ్‌ఎంఎస్) అనుబంధ సంస్థ సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను, యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎండీ రియాజ్ అహ్మద్‌ను యూనియన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో రెండు రోజులుగా జరుగుతున్న మహాసభల్లో యూనియన్ కేంద్ర నాయకులు తీర్మానం చేశారు. యూనియన్ పేరును ఇకపై అఖిల భారత మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్‌గా మార్చాలని సభలో నిర్ణయించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై కొన్ని ఘడియల్లో విచారణ
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు
For More TG News And Telugu News