Share News

ప్రజల ముంగిట్లోకి సంక్షేమ పథకాలు

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:01 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన 15 నెల ల్లోనే ప్రజల ముంగిట్లోకి సంక్షేమ పథకాలు వచ్చాయని ఎమ్మెల్యే చింతకుంట విజ యరమణారావు అన్నారు. సోమవారం అంకంపల్లెలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గుపో శారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభు త్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయన్నారు.

 ప్రజల ముంగిట్లోకి సంక్షేమ పథకాలు

కాల్వశ్రీరాంపూర్‌, మార్చి 10(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన 15 నెల ల్లోనే ప్రజల ముంగిట్లోకి సంక్షేమ పథకాలు వచ్చాయని ఎమ్మెల్యే చింతకుంట విజ యరమణారావు అన్నారు. సోమవారం అంకంపల్లెలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గుపో శారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభు త్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. నాలు గేళ్లలో నియోజకవర్గంలో 14వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అవుతున్నాయన్నారు. అంకంపల్లెను పైలెట్‌ ప్రాజెక్టు కింద తీసుకొని గ్రామానికి రేషన్‌ కార్డులు, రైతుభ రోసా, ఆత్మీయ భరోసా పథకాలు ఇస్తున్నామన్నారు. అంకంపల్లెకు 119ఇండ్లు మం జూరయ్యాయన్నారు. పది సంవత్సరాలుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండి ఒక్క ఇల్లు, రేషన్‌కార్డు ఇవ్వలేదన్నారు. నియోజకవర్గంలో 74శాతం మంది రైతులకు రుణమాఫీ జరిగిందని, అసెంబ్లీలో ప్రతిపక్షాలు సవాల్‌ విసిరితే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సవాల్‌ స్వీకరించలేదన్నారు. మాజీ ఎంపీపీ గోప గోని సారయ్యగౌడ్‌, వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ రామిడి తిరుపతిరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, మాజీ సర్పంచ్‌ పూర్ణచందర్‌, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, మాజీ సర్పంచ్‌ ఆకుల చిరంజీవి, మాజీ ఎంపీటీసీ కొత్తూరి లక్ష్మిమొండయ్య, ఎండి.సజ్జు పాల్గొన్నారు.

పెద్దపల్లి రూరల్‌, (ఆంధ్రజ్యోతి): అర్హులైన పేదలందరికి సంక్షేమ పథకాలను అమలు చేస్తా మని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు నిమ్మనపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే ముగ్గు పోసి ప్రారంభించారు. గ్రామంలో 153 మంది లబ్ధి దారులకు దశలవారీగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. మార్కేట్‌ చైర్‌పర్సన్‌ ఈర్ల స్వరూప, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీవో ఫయాజ్‌, కార్యదర్శి రాజ్‌కుమార్‌, మాజీ జడ్పీటీసీ బండారి రాంమ్మూర్తి, నాయకులు ప్రదీప్‌, గిరినేని సంపత్‌రావు, సంతోష్‌ యాదవ్‌, కడార్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

పాలకుర్తి, (ఆంధ్రజ్యోతి): మహిళలను మహారాణులను చేయడమే కాంగ్రెస్‌ ప్రభు త్వ లక్ష్యమని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ అన్నారు. రామరావుపల్లిలో ఇం దిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసి భూమి పూజ చేశారు. ఎంపీడివో కార్యాలయం ఆవ రణలో 40 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలకు ఏడాదికి 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. మహిళా సంఘాలతో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేయించే కార్యక్ర మానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆ దిశగా సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. రామరావుపల్లిలో 121 మందిని ఇందిరమ్మ ఇళ్లకు అర్హూలుగా ప్రకటించామని, అందులో భాగంగానే గ్రామంలో నలుగురికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసి, భూమి పూజ చేసి పనులను ప్రారంభించామని పేర్కోన్నారు. త్వరలో అధికారికంగా బండలవాగు ప్రాజేక్టు పను లను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు తిరస్కరించినా బీఆర్‌ఎస్‌ నాయకుల్లో మార్పురావడం లేదని అన్నారు. మనాలి ఠాకూర్‌,పలు ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 12:01 AM