Share News

రామగుండాన్ని బిజినెస్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తాం

ABN , Publish Date - Mar 12 , 2025 | 12:32 AM

రామగుండం పునర్‌ నిర్మాణ దిశగా కార్యాచరణ అమలు చేస్తున్నామని, రామగుండం నగరాన్ని బిజినెస్‌, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు. మంగళవారం మెయిన్‌ చౌరస్తాలో సింగరేణి ఆధ్వర్యంలో రూ.15 కోట్లతో నిర్మించ తలపెట్టిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులను ప్రారంభించారు.

రామగుండాన్ని బిజినెస్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తాం

గోదావరిఖని, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): రామగుండం పునర్‌ నిర్మాణ దిశగా కార్యాచరణ అమలు చేస్తున్నామని, రామగుండం నగరాన్ని బిజినెస్‌, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు. మంగళవారం మెయిన్‌ చౌరస్తాలో సింగరేణి ఆధ్వర్యంలో రూ.15 కోట్లతో నిర్మించ తలపెట్టిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతంలో విధ్వంసం జరిగిందని, యువత ఉపాధి లేక నష్టపోయారన్నారు. వ్యాపార రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ ప్రాంతంలో ఉపాధి కల్పించేందుకు సింగరేణి నుంచి రూ.15కోట్ల నిధులు తీసుకువచ్చి షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తు న్నామన్నారు. ఏ ఒక్క పేదవాడికి నష్టం కాకుండా కాంప్లెక్స్‌ నిర్మించి వారికి అవకాశం ఇవ్వనున్నామన్నారు. 8నెలల్లో కాంప్లెక్స్‌ నిర్మాణ పనులు పూర్తవు తాయని తెలిపారు. సెంటినరీకాలనీ నుంచి గోదావరిఖనికి రూ.23కోట్లతో నాలుగు లైన్ల రహదారి నిర్మిస్తామ న్నారు. రూ.200 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ మంజూ రైందని, అలాగే రూ.80 కోట్లతో ఆర్‌అండ్‌బీ నిధులతో చేపట్టనున్న పను లు టెండర్‌ దశలో ఉన్నా యన్నారు. ఎన్‌టీపీసీ మూడు యూనిట్లు, జెన్‌కోకు సంబంధించి 800మెగావాట్ల యూనిట్‌, సింగరేణి సంప్‌డ్‌ స్టోరేజ్‌ పవర్‌ ప్లాంట్‌ పనులు త్వరలోనే ప్రారంభం జరుగుతాయన్నారు. తనను లక్ష్యంగా చేసుకుని కొందరు స్వార్థపరులు చేస్తున్న ఆరోపణలకు అభివృద్ధిని చూస్తున్న ప్రజలే సమాధానం చెబుతారన్నారు. ఆర్‌జీ-1 జీఎం లలిత్‌ కుమార్‌, డీజీఎం(పర్సనల్‌) కిరణ్‌బాబు, ఆంజనేయులు, ఆంజనేయప్రసాద్‌, వరప్రసాద్‌, హన్మంతరావు, దుర్గాప్రసాద్‌, ఎమ్మెల్యే సతీమణి మనాలీ ఠాకూర్‌, నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేష్‌, దీటి బాలరాజు, మారెల్లి రాజిరెడ్డి, తిప్పారపు శ్రీనివాస్‌, గట్ల రమేష్‌, పెద్దెల్లి ప్రకాష్‌, పోలుసాని శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2025 | 12:32 AM