Share News

యువత ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు వీ-హబ్‌ సహకారం

ABN , Publish Date - Mar 12 , 2025 | 12:34 AM

యువత ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు వీ హబ్‌ సహకారం అందిస్తుం దని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళ వారం కలెక్టరేట్‌లో విద్యార్థులకు నిర్వహిం చిన ఐడియేషన్‌ బూట్‌ క్యాంపులో పాల్గొ న్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థులు బాజ్‌ చేసే ధోరణి నుంచి జాబ్‌లు సృష్టిం చాలనే లక్ష్యాలు నిర్ధేశించుకోవాలని కలెక్టర్‌ తెలిపారు.

యువత ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు వీ-హబ్‌ సహకారం

పెద్దపల్లి కల్చరల్‌, మార్చి 11 (ఆంధ్ర జ్యోతి): యువత ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు వీ హబ్‌ సహకారం అందిస్తుం దని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళ వారం కలెక్టరేట్‌లో విద్యార్థులకు నిర్వహిం చిన ఐడియేషన్‌ బూట్‌ క్యాంపులో పాల్గొ న్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థులు బాజ్‌ చేసే ధోరణి నుంచి జాబ్‌లు సృష్టిం చాలనే లక్ష్యాలు నిర్ధేశించుకోవాలని కలెక్టర్‌ తెలిపారు. చిన్నతనం నుంచి మనం పెరిగిన వాతావరణం ఒక మంచి జాబ్‌ దొరికితే లైఫ్‌ సెటిల్‌ అవుతుందనే ఆలోచన మనకు ప్రేరే పిస్తుందని, వీహబ్‌ ద్వారా యువతకు మరో వైపు గల అవకాశాలు, యువత ఆశయాలకు తోడ్పాటు అందిం చేందుకు చర్యలు చేపట్టా మన్నారు. స్విగ్గీ, ఓయో, రాపిడో, ఓలా వం టి వివిధ కంపె నీలు చిన్న చిన్న ఆలోచ నలతో ప్రారంభమయ్యాయన్నారు. యువత ఆలోచిస్తే సమాజంలో అనేక అవకాశాలు వస్తాయన్నారు. యువత ఆలోచనకు సపోర్ట్‌ చేసేలా వీహబ్‌లో ఎకో సిస్టం ఏర్పాటు చేశా మన్నారు. వీ హబ్‌ సంచాలకులు జహీద్‌ అక్తర్‌షేక్‌, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం.కాళిందిని, స్టూడెంట్‌ ప్రోగ్రాం లీడ్‌ జై, ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ సాయిరాం, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ వెంకటేష్‌, జిల్లా పరిశ్రమల అధికారి కీర్తికాంత్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ మురళి, గోదావరిఖని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ ఉష, విద్యార్థులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2025 | 12:34 AM