డ్రగ్స్ నష్టాలపై విస్తృత ప్రచారం చేయాలి
ABN , Publish Date - Mar 16 , 2025 | 12:22 AM
జిల్లాలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై విస్తృత ప్రచారం చేయాలని అద నపు కలెక్టర్ డి.వేణు అధికారులను ఆదేశిం చారు. శనివారం కలెక్టరేట్‌లో మాదక ద్రవ్యా ల, డ్రగ్స్ నియంత్రణకు చేపట్టిన చర్యలపై జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావే శాన్ని నిర్వహించారు.

పెద్దపల్లిటౌన్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై విస్తృత ప్రచారం చేయాలని అద నపు కలెక్టర్ డి.వేణు అధికారులను ఆదేశిం చారు. శనివారం కలెక్టరేట్‌లో మాదక ద్రవ్యా ల, డ్రగ్స్ నియంత్రణకు చేపట్టిన చర్యలపై జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావే శాన్ని నిర్వహించారు. జిల్లాలో నమోదవు తున్న కేసులు, గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, మోడల్ పాఠ శాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశా లల్లో డ్రగ్స్ మాదకద్ర వ్యాల వల్ల కలిగే నష్టా లపై వైద్యాధికారులతో అవగాహన కార్యక్ర మాలు నిర్వహించాలని సూచించారు.
మాదక ద్రవ్యాల రవాణా, సాగు, వినియోగం నివారణకు పటిష్ట చర్యలు తీసు కోవాలన్నారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి అవసరమైన చికిత్స, కౌన్సె లింగ్ అందించాలన్నారు. గోదావరిఖని ఆసు పత్రిలో 10 పడకల డీ అడిక్షన్ సెంటర్ ఏర్పా టు చేసినట్లు, అవసరమైన వారికి చికిత్స అందించాలన్నారు. జిల్లాలోని ఆసుపత్రులు, మెడికల్ షాపులలో స్టాక్ వివరాలను ప్రతీ నెల తనిఖీ చేయాలని డ్రగ్ ఇన్స్‌పెక్టర్‌కు సూచించారు. చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుందని, ఆలోచనా విధానం, ఆలోచనా శక్తి నశి స్తాయన్నారు.