‘ఉపాధి’ దూరం చేసే బిల్లును రద్దు చేయాలి
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:10 PM
గ్రామీణ పేదల జీవనోపాధిని దూరం చేసే వీబీజీ రామ్‌జీ బిల్లును రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి యాకయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్‌లో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బిల్లు ప్రతులను దహనం చేశారు.
జ్యోతినగర్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ పేదల జీవనోపాధిని దూరం చేసే వీబీజీ రామ్‌జీ బిల్లును రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి యాకయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్‌లో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బిల్లు ప్రతులను దహనం చేశారు. ఆయన మాట్లా డుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ, దాని స్థానంలో నూతన బిల్లు తీసుకురావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు భారంగా మారుతాయని, అలా గే మహాత్ముని పేరు ను తొలగిం చడం సిగ్గు చేటన్నారు. ఉపాధి హామీ పథకం పేద ప్రజలకు పని కల్పించే హక్కును ప్రసాదించిందని, కొత్త చట్టం వల్ల ఉపాధి కూలీలకు పనులు కల్పించే స్థితి ఉండ దని ఆరోపించారు. ప్రస్తుతం 50 రోజుల పని దినాలు కూడా ఉండటం లేదని ఆయన పేర్కొ న్నారు. వెంటనే ఈ బిల్లును రద్దు చేయాలని, వంద రోజుల పనిదినాలను 200 రోజులకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు ముత్యం రావు, వేల్పుల కుమారస్వామి, రామాచారి, నాయకులు బిక్షపతి, గీట్ల లక్ష్మారెడ్డి, యాకూబ్, దండ రాఘవరెడ్డి, అక్కపాక శంకర్, తోట రవీందర్, కాదాసి మల్లేష్, లక్ష్మయ్య, సునీత, లక్ష్మణ్, లింగయ్య పాల్గొన్నారు.