Share News

గోదావరిఖని నుంచి ఎర్రవెల్లి వరకు మహాపాదయాత్ర

ABN , Publish Date - Mar 16 , 2025 | 12:24 AM

గోదా వరిఖని నుంచి ఎరవెల్లి వరకు పాద యాత్ర చేపట్టనున్నట్లు బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్య క్షుడు కోరుకంటి చందర్‌ తెలిపారు. బీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో చందర్‌ మాట్లాడారు. ఎండిన గోదావరి పరివాహక ప్రాంతాల్లో తాగు, సాగునీటి ఇబ్బందులను ప్రజలకు వివరించేందుకు తెలంగాణ ఉద్యమ కారుల మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టా లని పేర్కొన్నారు.

గోదావరిఖని నుంచి ఎర్రవెల్లి వరకు మహాపాదయాత్ర

పెద్దపల్లి టౌన్‌ మార్చి 15 (ఆంధ్రజ్యోతి): గోదా వరిఖని నుంచి ఎరవెల్లి వరకు పాద యాత్ర చేపట్టనున్నట్లు బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్య క్షుడు కోరుకంటి చందర్‌ తెలిపారు. బీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో చందర్‌ మాట్లాడారు. ఎండిన గోదావరి పరివాహక ప్రాంతాల్లో తాగు, సాగునీటి ఇబ్బందులను ప్రజలకు వివరించేందుకు తెలంగాణ ఉద్యమ కారుల మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టా లని పేర్కొన్నారు. ఈనెల 17న గోదావరిఖని గోదావరి బ్రిడ్జి నుంచి ప్రారంభించి 22న ఎర్రవెల్లి వరకు 180 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు.

ఉత్తర తెలం గాణలో సాగునీటి కొరత, గోదావరి దుస్థితిని అపర భగీరథుడు, మాజీ సీఎం, తెలంగాణ సాధకులు కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. గోదావరి పరివాహక ప్రాంతం ఇప్పుడే ఎడా రిగా మారిందన్నారు. కాంగ్రెస్‌ పాలనలో ప్రజలు, రైతులు గోసపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌పై అక్కసుతోనే కాళే శ్వరం ప్రాజెక్టుపై కుట్రపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్‌ స్టేషన్లు, 20 కిలోమీటర్ల సొరంగాలతో 141 టీఎంసీల నీటి సామర్థ్యంతో 530 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసే కాళేశ్వరం ప్రాజె క్టును పనికి రాకుండా చేసే కుట్రకు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడిందన్నారు. ఈనెల 17న ఉద్యమకారుడు బొడ్డు రవీందర్‌ సమన్వ యంతో చేపట్టే మహాపాదయాత్రను జిల్లా ల్లోని పార్టీ శ్రేణులు, రైతులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నాయ కులు మూల విజయరెడ్డి, ఐలయ్య యాదవ్‌, రఘువీర్‌సింగ్‌, రవీందర్‌, పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 12:24 AM