పారిశుధ్య పనుల పరిశీలన
ABN , Publish Date - Mar 14 , 2025 | 12:31 AM
మండలంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గురువారం కన్నాల, జీడినగర్, బసంత్‌నగర్, జయ్యా రం, గుడిపెల్లి, పుట్నూర్ గ్రామాల్లో జరుగుతున్న పనులను జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య పరిశీలించారు.

పాలకుర్తి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): మండలంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గురువారం కన్నాల, జీడినగర్, బసంత్‌నగర్, జయ్యా రం, గుడిపెల్లి, పుట్నూర్ గ్రామాల్లో జరుగుతున్న పనులను జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య పరిశీలించారు. తాగునీటి సరఫరాపై వచ్చిన సమ స్యలను, పైపులైన్ లీకేజీలను అరికట్టాలన్నారు. రోజు గ్రామంలో ఉదయం ట్రాక్టర్‌తో ఇంటి ఇంటికి తిరిగి తడి, పొడి చెత్తను తీసుకొని డంప్‌యార్డ్‌కు తరలించి వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని సూచించారు. మిషన్‌భగీరథ ఈఈ శ్రీనివాస్, డీఈ సునీల్, ఎంపిడీఓ కలికోట రామ్మోహన్ చారి, ఎంపీవో ఉప్పు సుదర్శన్, కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
మంథనిరూరల్ (ఆంధ్రజ్యోతి): మండలంలోని గుంజపడుగు, నాగారం, మల్లెపల్లి, ఎక్లాస్‌పూర్, సూర య్యపల్లి గ్రామాల్లో జరుగుతున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య గురువారం పరిశీలించారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరం సక్రమంగా జరగాలని, గ్రామాల్లో సేకరించిన తడి, పొడి చెత్తను సెగ్రిగేషన్ షెడ్లలో వేరు చేసి నాణ్యమైన కంపోస్టు తయారు చేయాలని కార్యదర్శులకు సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్ రాయితీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయన వెంట డీఎల్‌పీవో కే. సతీష్‌కుమార్, కార్యదర్శులు ఉన్నారు.
ఎలిగేడు(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పథకాలను సద్వి నియోగం చేసుకోవాలని డీఎల్‌పీవో అన్నారు. సుల్తా న్‌పూర్, ఎలిగేడు, ముప్పిరితోట, లోకపేట గ్రామాల్లో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ సిగ్రిగేషన్ షెడ్లలో సేంద్రియ ఎరువులను తయారు చేయాల న్నారు. తయారైన ఎరువును రైతులకు విక్రయించి వచ్చిన డబ్బులను గ్రామపంచాయతీ ఖాతాలో జమ చేయాలని సూచించారు. సుల్తాన్‌పూర్‌లో కూరగా యల మార్కెట్, పంచాయతీ షెట్టర్స్ వేలం నిర్వహిం చగా అందులో పాల్గొన్నారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని, అందుకు కార్యదర్శులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను ఈనెల 31లోపు తగిన రుసుము చెల్లిస్తే 25శాతం సబ్సిడీ ఉందని పేర్కొ న్నారు. ఎంపీడీఓ భాస్కర్‌రావు, ఎంపీవో ఎండి.ఆరి ఫ్, కార్యదర్శులు శివకుమార్, అంజలి, శిరీష, మాసోద్దీన్, పున్నమయ్య, మహేష్ పాల్గొన్నారు.