Share News

అంబరాన్నంటిన హోలీ సంబరాలు

ABN , Publish Date - Mar 14 , 2025 | 11:45 PM

జిల్లా కేంద్రంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ యువతీ యువకులు కేరింతలు కొట్టారు. చిన్నారులు కలర్‌ నీళ్లతో ఒక రిపై ఒకరు చల్లుకుంటూ నృత్యాలు చేశారు. ప్రభుత్వ ఐటీఐ మైదానంలో వాకర్స్‌ హోలీ వేడుకలు నిర్వహించారు.

అంబరాన్నంటిన హోలీ సంబరాలు

పెద్దపల్లి కల్చరల్‌, మార్చి 14(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ యువతీ యువకులు కేరింతలు కొట్టారు. చిన్నారులు కలర్‌ నీళ్లతో ఒక రిపై ఒకరు చల్లుకుంటూ నృత్యాలు చేశారు. ప్రభుత్వ ఐటీఐ మైదానంలో వాకర్స్‌ హోలీ వేడుకలు నిర్వహించారు. వాకర్స్‌ అసోసియేషన్‌ నాయకుడు సంపత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కమాన్‌ రోడ్డువద్ద బీజేపీ, బీజేవైఎం, భజరంగ్‌దల్‌ నాయకులు రంగులు చల్లుకొని హోలీ సంబరాలు పంచుకు న్నా రు. జెండా కూడలిలో యువతీ యువకులు మా ర్వాడి మహిళలు హోలీ సంబరాలు ఉత్సా హంగా జరుపుకున్నారు.

కళ్యాణ్‌నగర్‌ /మార్కండేయకాలనీ: రామగుండం పారిశ్రామిక ప్రాంతం లో హోలీ వేడుకలు ఆనందోత్సవాల మధ్య జరిగాయి. కాలనీల్లో చిన్నా పెద్దా రంగులు చల్లుకున్నారు. బైక్‌లపై షికార్లు చేసుకుంటూ, కోడిగుడ్లు కొట్టుకుంటూ హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. చౌరస్తాలోని వైట్‌ హౌస్‌ వద్ద హోలీ సంబరాలు నిర్వహించారు. పలుపార్టీల నాయకులు పాల్గొన్నా రు. కాంగ్రెస్‌ నాయకుడు దీటి బాలరాజు ఆధ్వర్యంలో హోలీ వేడుకలు జరిగాయి. వన్‌టౌన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. మార్కండేయకాలనీలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన హోలీ వేడు కలకు కందుల సంధ్యారాణి పాల్గొన్నారు. బీఎంఎస్‌ నాయకుడు యాదగిరి సత్తయ్య ఆధ్వర్యంలో చౌరస్తాలో హోలీ వేడుకలను నిర్వహించారు.

కోల్‌సిటీ : కమిషరేట్‌లో హోలీ సంబరాల్లో సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా పాల్గొన్నారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్‌, అడిషనల్‌ డీసీపీ సీపీకి రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపారు. డప్పు నృత్యాలతో కమిషనర్‌, అధికారులు, సిబ్బంది హోలీ వేడుకల్లో నృత్యాలు చేశారు. హోలీ పండుగ జీవితాలను రంగుల మయం చేయాలని ఆకాంక్షించారు. సీపీ చిన్న పిల్లలకు మిఠాయిలు పంపిణీ చేశారు. స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్‌, ట్రాఫిక్‌ ఏసీపీ నర్సింహాలు, టాస్స్‌ఫోర్స్‌ ఏసీపీ మల్లారెడ్డి, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలతో పాటు పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2025 | 11:45 PM