Share News

కృత్రిమ మేథతో విద్యాబోధనకు శ్రీకారం

ABN , Publish Date - Mar 16 , 2025 | 12:20 AM

ప్రాథమిక పాఠశాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ద్వారా విద్యాబోధనకు శనివా రం శ్రీకారం చుట్టారు. రామగుండం మల్యాలపల్లి, గోదావరిఖని లోని గాంధీ పార్కు ఉర్ధూమీడియం, రామగుండంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలల్లో ఎంఈవో గడ్డం చంద్రయ్య ప్రారంభించారు.

కృత్రిమ మేథతో విద్యాబోధనకు శ్రీకారం

కోల్‌సిటీటౌన్‌, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక పాఠశాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ద్వారా విద్యాబోధనకు శనివా రం శ్రీకారం చుట్టారు. రామగుండం మల్యాలపల్లి, గోదావరిఖని లోని గాంధీ పార్కు ఉర్ధూమీడియం, రామగుండంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలల్లో ఎంఈవో గడ్డం చంద్రయ్య ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఏఐ బోధనలో కనీస సామర్ధ్యాలు పొందని విద్యార్థులకు కంప్యూటర్‌ ద్వారా ఉపాధ్యా యులు బోధన చేస్తారన్నారు. కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు శారద, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌, ఉపాధ్యా యులు పాల్గొన్నారు.

ధర్మారం, (ఆంధ్రజ్యోతి): నర్సింహులపల్లి, కొత్తూర్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ విద్యను మండల విద్యాశాఖ అధికారి పోతు ప్రభాకర్‌ ప్రారంభించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెం పొందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 6 జిల్లాల్లో ప్రారంభించింది. జిల్లాలో 15 పాఠశాలలను ఎంపిక చేశారు. శనివారం ఆయా పాఠశాలల్లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా రూపొందించిన ఏఐ విద్యను ప్రారంభించారు. దీని ద్వారా విద్యార్ధులు రాయడం, చద వడంతోపాటు భాషపై పట్టు సాధిస్తారని ఎంఈఓ తెలిపారు. గణితంలో నైపుణ్యం సాధిస్తారని, పిల్లల్లో సృజనాత్మకత పెరిగేం దుకు ఏఐ విద్య ఎంతో ఉపకరిస్తుందన్నారు. దొంగతుర్తి కాంప్లెక్స్‌ హెడ్‌ మాస్టర్‌ వేణగోపాల్‌ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు రవీందర్‌, సత్యం, సతీష్‌కుమార్‌, చెన్నారెడ్డి, ఆనంద్‌, అమ్మ ఆదర్శకమిటీ చైర్‌పర్సన్లు, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 12:20 AM