Share News

Karimnagar: కాషాయం గూటికి కరీంనగర్‌ మేయర్‌

ABN , Publish Date - Jan 25 , 2025 | 04:56 AM

ఆయనతో పాటు 10 మంది కార్పొరేటర్లు కూడా బీఆర్‌ఎ్‌సను వీడనున్నారు. శనివారం నగరంలోని ఎస్‌బీఎస్‌ ఫంక్షన్‌హాల్‌లో కేంద్రహోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ సమక్షంలో తాము బీజేపీలో చేరుతున్నట్లు సునీల్‌రావు ప్రకటించారు.

Karimnagar: కాషాయం గూటికి కరీంనగర్‌ మేయర్‌

  • బీఆర్‌ఎ్‌సకు గుడ్‌ బై.. 10 మంది కార్పొరేటర్లు కూడా

కరీంనగర్‌, జనవరి 24(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు బీఆర్‌ఎస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయనతో పాటు 10 మంది కార్పొరేటర్లు కూడా బీఆర్‌ఎ్‌సను వీడనున్నారు. శనివారం నగరంలోని ఎస్‌బీఎస్‌ ఫంక్షన్‌హాల్‌లో కేంద్రహోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ సమక్షంలో తాము బీజేపీలో చేరుతున్నట్లు సునీల్‌రావు ప్రకటించారు. కొద్దికాలంగా బండి సంజయ్‌తో సన్నిహితంగా ఉంటూ వస్తున్న సునీల్‌రావు బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతున్నది.


సునీల్‌ రావు మాత్రమే కాకుండా బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన మెజార్టీ కార్పొరేటర్లను కూడా పార్టీ మార్పించాలని కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్‌ కార్యాచరణ రూపొందించి ఆయనకు అప్పగించారు. తొలుత 16 మంది కార్పొరేటర్లు బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేస్తారని భావించారు. అయితే స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ కొందరిని బుజ్జగించి పార్టీ వీడకుండా ఒప్పించగలిగారని, దీంతో సునీల్‌రావుతో 10 మంది కార్పొరేటర్లు మాత్రమే బీజేపీలో చేరుతున్నారని తెలుస్తున్నది. ఈ నెల 28తో కరీంనగర్‌ కార్పొరేషన్‌ పాలకవర్గ పదవీకాలం ముగియనుండడంతో ఆలోగానే బీఆర్‌ఎ్‌సకు తమ రాజీనామాలతో షాక్‌ ఇవ్వనున్నారు.

Updated Date - Jan 25 , 2025 | 04:56 AM