NEET PG: 91 పీజీ వైద్య సీట్ల భర్తీకి నోటిఫికేషన్
ABN , Publish Date - Mar 01 , 2025 | 04:00 AM
నీట్ పీజీ కటాఫ్ స్కోర్‌ను ఐదు శాతానికి తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రంలో అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకుగాను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): నీట్ పీజీ కటాఫ్ స్కోర్‌ను ఐదు శాతానికి తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రంలో అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకుగాను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో మిగిలిన సీట్లను భర్తీచేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 3 సాయంత్రం 6 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వర్సిటీ పేర్కొంది.
క్లినికల్ సీట్లన్నీ ఇప్పటికే భర్తీ అయ్యాయని, ప్రస్తుతం 91 నాన్ క్లినికల్ విభాగంలో సీట్లే ఉన్నట్టు తెలిపింది. గతంలో కన్వీనర్ కోటా సీట్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఇప్పుడు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరంలేదని పేర్కొంది.