Jubilee Hills Bipole: జూబ్లీహిల్స్ బైపోల్.. పొద్దుపొద్దునే బీజేపీ, కాంగ్రెస్ నేతల ప్రచారం
ABN , Publish Date - Nov 02 , 2025 | 10:24 AM
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు స్పీడు పెంచాయి. ఉదయం నుంచే పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇవాళ ఉదయం యూసుఫ్‌గూడలోని కృష్ణకాంత్ పార్క్‌లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం చేశారు. మార్నింగ్ వాక్‌లో భాగంగా కృష్ణకాంత్ పార్కులో బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
హైదరాబాద్, నవంబర్ 2: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు స్పీడు పెంచాయి. ఉదయం నుంచే పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇవాళ ఉదయం యూసుఫ్‌గూడలోని కృష్ణకాంత్ పార్క్‌లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఓటు వేసి గెలిపించాలని మార్నింగ్ వాకర్స్‌ను కోరారు. స్థానికుడు, విద్యావంతుడు, నిత్యం ప్రజల మధ్య ఉండే వ్యక్తి ప్రజలకు అండగా ఉండే వ్యక్తి నవీన్ యాదవ్ అని కొనియాడారు. ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం భరించలేని అప్పుల భారాన్ని ప్రజలపై మోపినా.. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అటు అప్పులను, ఇటు సంక్షేమాన్ని మేనేజ్ చేసుకుంటూ ముందుకు సాగుతుందన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
అటు మార్నింగ్ వాక్‌లో భాగంగా కృష్ణకాంత్ పార్కులో బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని మార్నింగ్ వాకర్స్‌ను కోరారు. దేశం అభివృద్ధి చెందాలంటే, అవినీతిరహిత పాలన జరగాలంటే బీజేపీ పార్టీ తోనే సాధ్యమని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు సాధించిన విధంగానే.. జూబ్లీహిల్స్‌లోనూ బీజేపీ గెలుపునకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ ఉపఎన్నికలో లంకల దీపక్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. జమ్మూ కాశ్మీర్ పహాల్గమ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడారని అన్నారు. దేశాన్ని, సైనికులను అవమానించేలా రేవంత్ రెడ్డి మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు. దేశ ప్రజలకు, సైనికులకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల తర్వాత మైనార్టీలు గుర్తుకు వచ్చారా? అని ఫైర్ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో లబ్ది పొందాలనే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి:
Kavitha: జాగృతి టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీ.. ప్రకటించిన కవిత
BRS Executive President KTR criticized Congress: కాంగ్రెస్‌తో ఫేక్ బంధం.. బీజేపీతో పేగు బంధం