ప్లాట్ మార్ట్‌గేజ్‌కు 10 వేలు లంచం డిమాండ్
ABN , Publish Date - Jan 16 , 2025 | 04:15 AM
ప్లాట్ మార్ట్‌గేజ్ చేసేందుకు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్ ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సుంకె విష్ణుకు మెట్‌పల్లిలోని సాయిరాంనగర్ కాలనీలో 266 గజాల ప్లాట్ ఉంది.

ఏసీబీకి చిక్కిన మెట్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్
కేసు నమోదు.. రిమాండ్‌కు తరలింపు
మెట్‌పల్లిటౌన్, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): ప్లాట్ మార్ట్‌గేజ్ చేసేందుకు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్ ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సుంకె విష్ణుకు మెట్‌పల్లిలోని సాయిరాంనగర్ కాలనీలో 266 గజాల ప్లాట్ ఉంది. దాన్ని మార్ట్‌గేజ్ చేసేందుకు ఆయన మెట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. ఆయన ఫైలు సబ్‌రిజిస్ట్రార్ ఆసిఫుద్దీన్ వద్దకు చేరగా రూ. 10 వేలు లంచం ఇవ్వాల్సిందిగా కార్యాలయంలో పనిచేస్తున్న సబార్డినేట్ (ఆవుట్ సోర్సింగ్ ఉద్యోగి) బానోతు రవి ద్వారా సుంకె విష్ణుకు తెలియజేశాడు.
దీంతో బాధితుడు అంత ఇవ్వలేనని రూ.5వేలు ఇస్తానని ఒప్పందం చేసుకొని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు బుధవారం బాధితుడు సుంకే విష్ణు కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ వద్ద సహాయకుడిగా పనిచేస్తున్న ఆర్మూర్ రవికి రూ. 5 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఆనంతరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ ఆసిఫుద్దీన్, సబార్డినేట్ బానోతు రవి, డాక్యుమెంట్ రైటర్ సహాయకుడు ఆర్మూర్ రవిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.