Share News

Jagga Reddy: రాహుల్‌ను కలిసేందుకు.. ఢిల్లీకి జగ్గారెడ్డి

ABN , Publish Date - Mar 07 , 2025 | 05:07 AM

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీని కలిసేందుకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి రైలులో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. 2017లో సంగారెడ్డిలో తాను రాహుల్‌గాంధీ సభను భారీ ఎత్తున నిర్వహించానని, ఆ సభ ఏర్పాట్ల కోసం తాను ఎంత కష్టపడిందీ వివరించేందుకే ఢిల్లీకి వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Jagga Reddy: రాహుల్‌ను కలిసేందుకు.. ఢిల్లీకి జగ్గారెడ్డి

  • సంగారెడ్డిలో రాహుల్‌గాంధీ సభ సందర్భంగా ఎంత కష్టపడ్డానో వివరించేందుకేనని వెల్లడి

  • ఎమ్మెల్సీ సీటు అడిగేందుకుకాదంటూ వివరణ

  • తనది పడి పడి అడిగే గుణం కాదని స్పష్టీకరణ

  • ఊహాగానాలతో కూడిన వార్తలు రాయొద్దని వినతి

హైదరాబాద్‌, మార్చి 6(ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీని కలిసేందుకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి రైలులో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. 2017లో సంగారెడ్డిలో తాను రాహుల్‌గాంధీ సభను భారీ ఎత్తున నిర్వహించానని, ఆ సభ ఏర్పాట్ల కోసం తాను ఎంత కష్టపడిందీ వివరించేందుకే ఢిల్లీకి వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటు కోసం జగ్గారెడ్డి ఢిల్లీ వెళుతున్నారంటూ మీడియాలో వార్తలు రావడంతోనే గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. తాను ఎమ్మెల్సీ సీటు అడగట్లేదని, అడగబోనని తెలిపారు. సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చినా.. పరిస్థితులు అనుకూలించక ఓటమి పాలయ్యానని చెప్పారు.


మూడు సార్లు సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని, ఎమ్మెల్సీ కావాలంటూ పడి పడి అడిగే గుణం తనది కాదని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ సీటు విషయంలో తనపై ఊహాగానాలతో కూడిన వార్తలు రాయవద్దని మీడియాను కోరారు. సంగారెడ్డిలో సభ సందర్భంగా తాను ఎంత కష్ట పడిందీ.. రాహుల్‌కు వివరించేందుకు ఢిల్లీ వెళ్లాలని ఆరు నెలల నుంచీ అనుకుంటున్నానని తెలిపారు. ఆ సభ ఎలాంటి పరిస్థితుల్లో ఏర్పాటు చేశాం? ఎలా నిర్వహింంచాం? అనే వివరాలను ఆయనకు స్వయంగా వివరించేందుకే ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలిపారు. ఢిల్లీకి వెళ్లాక రాహుల్‌గాధీ అపాయింట్‌మెంట్‌ కోరతానని, దొరికితే ఆయనతో మాట్లాడతానని వెల్లడించారు.

Updated Date - Mar 07 , 2025 | 05:07 AM