Share News

Jagga Reddy: రెడ్డి సామాజిక వర్గంపై కొందరి విమర్శల్ని తప్పుగా తీసుకోకండి

ABN , Publish Date - Feb 26 , 2025 | 04:32 AM

‘‘తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గ బంధువులకు, సోదరులకు నా విజ్ఞప్తి! కాంగ్రెస్‌ పార్టీలోని ఇతర కులాలకు చెందిన కొంతమంది నాయకులు.. రెడ్డి సామాజిక వర్గంపై చేసిన విమర్శలు తప్పుగా తీసుకోకండి. వారి వ్యాఖ్యల పట్ల అన్యధా భావించకుండా..

Jagga Reddy: రెడ్డి సామాజిక వర్గంపై కొందరి విమర్శల్ని తప్పుగా తీసుకోకండి

  • కాంగ్రె్‌సలో అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఉంటుంది

  • అందరితో కలిసిపోయే సంప్రదాయం మనది

  • పార్టీలోకి మధ్యలో వచ్చిన కొందరు ఇతర కులాల నేతలవి అవగాహన లేని మాటలు

  • ముందునుంచీ కాంగ్రె్‌సలో ఉన్న ఇతర కులాల నేతల మాటలు కేవలం భావోద్వేగంతో మాట్లాడినవే

  • సామాజికవర్గంపై వ్యతిరేకతతో మాట్లాడినవి కావు

  • రెడ్డి సామాజికవర్గం రాష్ట్రంలో నాయకత్వ స్థానంలో ఉంది

  • సామాజిక వర్గం వారంతా పెద్ద మనసుతో ఉండాలి

  • టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గ బంధువులకు, సోదరులకు నా విజ్ఞప్తి! కాంగ్రెస్‌ పార్టీలోని ఇతర కులాలకు చెందిన కొంతమంది నాయకులు.. రెడ్డి సామాజిక వర్గంపై చేసిన విమర్శలు తప్పుగా తీసుకోకండి. వారి వ్యాఖ్యల పట్ల అన్యధా భావించకుండా.. మన సోదరులు చేసిన వ్యాఖ్యలుగానే భావించండి’’ అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రె్‌సలో నాయకులకు తమ అభిప్రాయా లు వెల్లడించే హక్కు, స్వేచ్ఛ ఉంటుందన్నారు. తెలంగాణలోని అన్ని గ్రామాల్లోనూ.. అన్ని కులాలు, మతా ల వారితో రెడ్డి సామాజిక వర్గం వారు సఖ్యత, స్నేహంతో కలిసి మెలిసి జీవిస్తారని, ఇది పూర్వం నుంచి వస్తున్న సంప్రదాయమని చెప్పారు.


ఆయా వర్గాల వారికి ఎలాంటి సమస్య.. కష్టం వచ్చినా పరిష్కరించేందుకు కృషి చేసే సామాజిక వర్గం.. రెడ్డి సామాజిక వర్గమన్నారు. అందుకే ఇన్నేళ్లుగా రెడ్డి సామాజిక వర్గం పట్ల ప్రజలు ఇంత ప్రేమ, ఆప్యాయత చూపిస్తున్నారన్నారు. కొంతమంది చేసిన వ్యా ఖ్యలకు బాధపడి, తప్పుగా అనుకుని కాంగ్రెస్‌ పట్ల వ్యతిరేక భావనతో ఉండొద్దన్నారు. కాంగ్రె్‌సలోకి మధ్యలో వచ్చిన కొంతమంది ఇతర కులాల నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, కానీ.. ముందునుంచీ కాంగ్రె్‌సలోనే ఉన్న కొందరు ఇతర కులాల నాయకులు ఇటీవల మాట్లాడిన మాటలు మాత్రం కేవలం భావోద్వేగంతో మాట్లాడినవేనని తెలిపారు. రెడ్డి సామాజికవర్గం ప్రస్తుతం రాష్ట్రంలో నాయకత్వస్థానంలో ఉందని, ఈ సామాజికవర్గం వారంతా పెద్ద మనసుతో.. ఓపికగా ఉండాలని మంగళవారం ఓ ప్రకటనలో సూచించారు.

Updated Date - Feb 26 , 2025 | 04:32 AM