Share News

ISKCON: హరే కృష్ణ ఉద్యమ వ్యవస్థాపకులు శ్రీల ప్రభుపాదులకు విశ్వగురు బిరుదు

ABN , Publish Date - Feb 12 , 2025 | 04:47 AM

ఇస్కాన్‌, హరేకృష్ణ ఉద్యమ వ్యవస్థాపకులు ఎ. సి. భక్తి వేదాంతస్వామి శ్రీల ప్రభుపాదులుకు అఖిల భారతీయ అఖార పరిషత్‌.. విశ్వగురు బిరుదును ఇచ్చింది.

ISKCON: హరే కృష్ణ ఉద్యమ వ్యవస్థాపకులు శ్రీల ప్రభుపాదులకు విశ్వగురు బిరుదు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): ఇస్కాన్‌, హరేకృష్ణ ఉద్యమ వ్యవస్థాపకులు ఎ. సి. భక్తి వేదాంతస్వామి శ్రీల ప్రభుపాదులుకు అఖిల భారతీయ అఖార పరిషత్‌.. విశ్వగురు బిరుదును ఇచ్చింది. ఈ బిరుదు పొందిన మొదటి వ్యక్తిగా శ్రీల ప్రభుపాదులు నిలిచారు. మహా కుంభమేళ సందర్భంగా ప్రయాగరాజ్‌లో సోమవారం శ్రీల ప్రభుపాదుల విగ్రహానికి పవిత్ర మంత్రోచ్ఛారణలతో అభిషేకం, పుష్పవృష్టి, హారతి, శుభసామగ్రి సమర్పించారు. ఈ కార్యక్రమంలో అఖార పరిషత్‌ అధ్యక్షులు మహంత్‌ రవీంద్రపూరి, వివిధ అఖారాల నుంచి వచ్చిన మహామండలేశ్వరులు, కార్యదర్శులు, సీనియర్‌ సాధువులు పాల్గొన్నారు.


గ్లోబల్‌ హరేకృష్ణ ఉద్యమం వైస్‌ ఛైర్మన్‌ చంచలపతి దాసు అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీల ప్రభుపాదులు తరఫున గ్లోబల్‌ హరేకృష్ణ ఉద్యమం చైర్మన్‌, ఇస్కాన్‌ బెంగళూరు అధ్యక్షులు మధు పండిట్‌ దాసు విశ్వగురు బిరుదును అందుకున్నారు. ఈ సందర్భంగా మధు పండిట్‌ దాసు మాట్లాడుతూ.. శ్రీల ప్రభుపాదులును విశ్వగురు బిరుదుతో సత్కరించడం ఇస్కాన్‌కు ఆనందాన్ని ఇస్తుందన్నారు. శ్రీకృష్ణుని సందేశాన్ని ప్రచారం చేయడానికి ఆయన చేసిన మార్గదర్శక ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని మార్చాయన్నారు.

Updated Date - Feb 12 , 2025 | 04:47 AM