Kukatpally: పోలీసుల అదుపులో డ్రగ్స్ స్మగ్లర్ గుణశేఖర్!
ABN , Publish Date - Jun 05 , 2025 | 03:29 AM
అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాకు ప్రాతినిధ్యం వహించిన తిరుపతి టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ గుణశేఖర్‌ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కేపీహెచ్‌బీకాలనీ, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాకు ప్రాతినిధ్యం వహించిన తిరుపతి టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ గుణశేఖర్‌ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితం కూకట్‌పల్లి ప్రాంతంలో డ్రగ్స్ విక్రయిస్తుండగా బాలానగర్ ఎస్‌వోటీ పోలీసులు ఆకస్మిక దాడి చేసి ఐదుగురిని పట్టుకున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో డ్రగ్స్ సఫ్లై చేస్తున్న గుణశేఖర్ తప్పించుకున్నాడు.
అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. బుధవారం ఏపీ, తెలంగాణ పోలీసులు గుణశేఖర్‌ను తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. గురువారం హైదరాబాద్ తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించే అవకాశముంది.
ఇవీ చదవండి:
రైల్వే టిక్కెట్ల వెనుక బిగ్ స్కాం.. మోసపోయిన లక్షల మంది..
జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి