iBomma Ravi: ఐబొమ్మ రవి కేసులో కీలక మలుపు
ABN , Publish Date - Nov 21 , 2025 | 09:31 AM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే పోలీసులు అతడిపై పది సెక్షన్ల కేసు నమోదు చేయగా.. తాజాగా మరో మూడు సెక్షన్లు జోడించారు.
ఇంటర్నెట్ డెస్క్: తెలుగునాట పైరసీ సినిమాల ప్రధాన సూత్రధారి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి(iBomma Ravi) కేసులో కీలక పరిణామం చోట చేసుకుంది. ఇప్పటికే అతడిపై పది సెక్షన్ల కింద కేసులు పెట్టిన పోలీసులు.. తాజాగా మరో మూడు సెక్షన్లను జోడించారు. ఇప్పటికే ఐబొమ్మ, బప్పం సైట్లను సైబర్ క్రైం పోలీసులు రవితోనే బ్లాక్ చేయించిన సంగతి తెలిసిందే.
ఫోర్జరీ కేసు..
ఇప్పటికే ఐటీ యాక్ట్, బీఎన్ఎస్, సినిమాటోగ్రఫీ యాక్ట్, ఫారినర్స్ యాక్ట్, సినిమా పైరసీ వంటి పది సెక్షన్ల కింద ఇమ్మడి రవిపై కేసు నమోదు చేశారు. తాజాగా అతడిపై ఫోర్టరీ కేసు కూడా నమోదైంది. ప్రహ్లాద్ అనే వ్యక్తి పేరు మీద పాన్‌కార్డు, బైక్ లైసెన్స్, ఆర్‌సీలు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే పోలీసు కస్టడీలో ఉన్న రవిని మరో రెండురోజుల పాటు విచారించనున్నారు. అతడి దగ్గర నుంచి మరింత కీలక సమాచారాన్ని రాబట్టనున్నారు.
బిగుస్తున్న ఉచ్చు
ఇమ్మడి రవిని రెండో రోజు కస్టడీకి తీసుకుని విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. గతంలో భారత పౌరసత్వం రద్దు చేసుకున్న రవి.. కరేబియన్ దీవుల్లో పౌరసత్వాన్ని అందుకున్నాడు. దీంతో అతడిపై ఫారినర్స్ యాక్ట్ కేసు నమోదు చేశారు. తొలి రోజు ఆరు గంటల పాటు అతడిని పోలీసులు ప్రశ్నించారు. అతడి బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీశారు. నెట్‌వర్క్, ఇంటర్నెట్ సోర్స్‌లపై విచారించారు. ఎన్‌ఆర్‌ఈ, క్రిప్టో కరెన్సీ, వ్యాలెట్లు, బ్యాంక్ ఖాతాలపై విచారణ చేశారు. వెబ్‌సైట్, ఐపీ అడ్రస్ సర్వర్లపైనా దృష్టి పెట్టారు. ఐబొమ్మ వెబ్‌సైట్ నడిపేందుకు రవి పలు ఐపీ అడ్రస్‌లు మార్చినట్లు పోలీసులు గుర్తించారు.
ఇవి కూడా చదవండి:
మినీ వేలాన్ని ఆపేయండి: రాబిన్ ఉతప్ప
పెళ్లి పీటలెక్కనున్న స్మృతి మంధాన
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి