Share News

Ibomma One: ఐబొమ్మ వన్‌పై పోలీసుల క్లారిటీ

ABN , Publish Date - Nov 20 , 2025 | 10:09 AM

ఆన్‌లైన్ మరో పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ వన్ ప్రత్యక్షమైందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై సైబర్ క్రైమ్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఇందులో నిజం లేదని తేల్చేశారు. ఆ వెబ్‌సైట్‌లో కేవలం రివ్యూస్ మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు.

Ibomma One: ఐబొమ్మ వన్‌పై పోలీసుల క్లారిటీ
Ibomma One

ఇంటర్నెట్ డెస్క్: ఆన్‌లైన్‌లో మరో పైరసీ వెబ్‌సైట్ గురించి జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు తర్వాత.. తెరపైకి ఐబొమ్మ వన్ అనే వెబ్‌సైట్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఐబొమ్మ వన్ సైట్ ఓపెన్ అవ్వడం లేదని స్పష్టం చేశారు.


‘ఐబొమ్మ వన్(Ibomma One) వెబ్‌సైట్‌లో కొత్త సినిమాలు పైరసీ అయ్యాయన్న ప్రచారంలో వాస్తవం లేదు. అందులో మూవీస్‌కి సంబంధించి రివ్యూస్ మాత్రమే ఉన్నాయి. అది ఓపెన్ చేస్తే మూవీ రూల్జ్‌కి రీడైరెక్ట్ అవ్వడం లేదు. ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్లను ఇప్పటికే బ్లాక్ చేయించాం. వేరే వెబ్ సైట్ల ద్వారా పైరసీకి పాల్పడితే వాటి దిశగా దర్యాప్తు చేస్తాం. మరికొద్ది సేపట్లో ఇమ్మడి రవిని కస్టడీలోకి తీసుకోబోతున్నాం’ అని వెల్లడించారు.


కరేబియన్ దీవుల్లో పెద్ద నెట్‌వర్క్ ఏర్పరచుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడమే కాకుండా సినిమాలను పైరసీ చేసి అప్‌లోడ్ చేస్తున్నందుకు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మ వన్ ప్రత్యక్షమైనట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏదైనా సినిమాను క్లిక్ చేస్తే నేరుగా ‘మూవీ రూల్జ్’కు రీడైరెక్ట్‌ అవుతోందని వార్తలు వచ్చాయి. దీంతో సైబర్ క్రైమ్ పోలీసుల క్లారిటీతో వీటికి చెక్ పడింది.


ఇవి కూడా చదవండి:

సౌతాఫ్రికాతో వన్డేలకు వాళ్లకు రెస్ట్!

అతడొక డమ్మీ కెప్టెన్!: కైఫ్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 20 , 2025 | 10:11 AM