Ibomma One: కొత్తగా ‘ఐబొమ్మ వన్’
ABN , Publish Date - Nov 20 , 2025 | 09:07 AM
ఆన్‌లైన్‌లో మరో కొత్త సైట్ పుట్టుకొచ్చింది. కొత్తగా ‘ఐబొమ్మ వన్’ ప్రత్యక్షమైంది. అందులోనూ కొత్త సినిమాలు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్, నవంబర్ 20: ఐబొమ్మ, బప్పం సైట్లను రూపొందించి పోలీసులకే సవాలు విసిరిన ఇమ్మడి రవిని పోలీసులు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు ఇంకా కొనసాగుతున్న తరుణంలో ఆన్‌లైన్‌లో మరో పైరసీ సైట్ పుట్టుకొచ్చింది. కొత్తగా ‘ఐబొమ్మ వన్’ అనే సైట్ ప్రత్యక్షమైంది. అందులోనూ కొత్త సినిమాలు కనిపిస్తున్నాయి.
క్లిక్ చేస్తే..
కొత్తగా ప్రత్యక్షమైన ఐబొమ్మ వన్(Ibomma One)లో ఏదైనా సినిమాను క్లిక్ చేస్తే నేరుగా ‘మూవీ రూల్జ్’కు రీడైరెక్ట్ అవుతోంది. ఐబొమ్మ ఎకో సిస్టమ్‌లో 65 మిర్రర్ వెబ్‌సైట్లు ఉన్నాయని, అందులో ఐబొమ్మ వన్‌ను ప్రచారంలోకి తెచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ రూల్జ్, తమిళ్ ఎంవీ సైట్లపైనా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.
వెలుగులోకి కొత్త విషయాలు..
ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసు దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండు నెలలకో దేశం తిరిగినా తప్పనిసరిగా కూకట్‌పల్లిలోని ఇంటికి చేరేవాడు. తన గుట్టు బయటపడుతుందనే భయం, మనుషులపై నమ్మకం సన్నగిల్లడం కారణంగా పనివాళ్లను ఏర్పాటు చేసుకోలేదని పోలీసులు భావిస్తున్నారు. అతడి వద్ద లభించిన సెల్‌ఫోన్‌లో కేవలం ఫుడ్ డెలివరీ బాయ్స్ నంబర్లు మాత్రమే ఉండటం పోలీసులను ఆశ్చర్యపరిచింది.
ఇవి కూడా చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి