Tragedy At Keerthi Towers: అయ్యో పాపం.. లిఫ్ట్‌లో ఇరుక్కున్న పిల్లాడు.. ఊపిరాడక..
ABN , Publish Date - Nov 19 , 2025 | 09:42 PM
అమీర్‌పేట ఎల్లారెడ్డి గూడలోని కీర్తి టవర్స్‌లో విషాదం చోటు చేసుకుంది. లిప్టులో ఇరుక్కుని ఊపిరాడక ఐదేళ్ల హర్షవర్ధన్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్, నవంబర్ 19: అమీర్‌పేట ఎల్లారెడ్డి గూడలోని కీర్తి టవర్స్‌లో విషాదం చోటు చేసుకుంది. లిప్టులో ఇరుక్కుని ఊపిరాడక ఐదేళ్ల హర్షవర్ధన్ మృతి చెందాడు. అతడి తల్లిదండ్రులు ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. బుధవారం సాయంత్రం విధుల నుంచి ఇంటికి వచ్చేన వారికి హర్షవర్ధన్ కనిపించ లేదు. దీంతో ఆందోళన చెందిన వారు.. బాబు ఆచూకీ కోసంగా ఇరుగు పొరుగు వారిని సంప్రదించారు. ఎక్కడ కనిపించ లేదు. బాలుడు లిఫ్ట్‌లో ఇరుక్కు పోయినట్లు గుర్తించారు. అప్పటికే ఆపస్మారక స్థితిలో ఉన్న హర్షవర్ధన్‌ను సమీపంలోని ఆసుపత్రికి తల్లిదండ్రులు తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. ఈ ఘటనపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అపార్ట్‌మెంట్ పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. బాలుడు మృతితో అతడి తల్లిదండ్రులు ఐశ్వర్య, నర్సీ నాయుడు కన్నీరు మున్నీరు అవుతున్నారు.