Share News

social justice campaign: సామాజిక న్యాయభేరి సభ.. సీఎం రేవంత్ ఏమన్నారంటే..

ABN , Publish Date - Jul 04 , 2025 | 06:18 PM

హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా సామాజిక న్యాయ సమరభేరి సభ ప్రారంభమైంది. జై బాపూ- జై భీమ్- జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కాగా.. మంత్రులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

social justice campaign: సామాజిక న్యాయభేరి సభ.. సీఎం రేవంత్ ఏమన్నారంటే..
CM Revanth Reddy

హైదరాబాద్: టీపీసీసీ తలపెట్టిన సామాజిక న్యాయ సమరభేరి సభ ప్రారంభమైంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,500 మందికిగా పైగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, అన్ని జిల్లాల, మండల కమిటీల కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. సుమారు సుమారు 40 వేల మంది పైగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ సభకు తరలివచ్చారు. కాగా, జై బాపూ- జై భీమ్- జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులు హాజరయ్యారు. ఈ సభలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కమిటీల అధ్యక్షులకు భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తున్నారు.

లైవ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jul 04 , 2025 | 06:27 PM