Share News

Coldwave intensifies across TG: రాష్ట్రంలో పెరిగిన చలి.. కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు..

ABN , Publish Date - Nov 29 , 2025 | 11:27 AM

తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. శీతాకాలం ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయిలో నమోదవుతున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎలా పడిపోయాయంటే..

Coldwave intensifies across TG: రాష్ట్రంలో పెరిగిన చలి.. కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు..
Coldwave intensifies across Telangana, Hyderabad

హైదరాబాద్, నవంబర్ 29: జీహెచ్ఎంసీ సహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలిగాలులు తీవ్రంగా విస్తరిస్తున్నాయి(Coldwave intensifies across TG and Hyd). పెరుగుతున్న చలి దృష్ట్యా.. శనివారం నాటికి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు(temperatures) భారీ స్థాయిలో పడిపోయాయి. సంగారెడ్డి ప్రాంతంలో కనిష్ఠంగా 7.8 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు పతనమవ్వగా.. జీహెచ్ఎంసీ పరిధిలో సాధారణం కంటే భిన్నంగా 11.7 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు తగ్గాయి.


పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయిలా..

  • సంగారెడ్డి - 7.8° సెంటిగ్రేడ్

  • ఆసిఫాబాద్‌ - 8.3° సెంటిగ్రేడ్

  • ఆదిలాబాద్‌ - 9.2° సెంటిగ్రేడ్

  • వికారాబాద్‌ - 9.5° సెంటిగ్రేడ్

  • కామారెడ్డి - 9.7° సెంటిగ్రేడ్

  • నిజామాబాద్‌ - 10° సెంటిగ్రేడ్

  • సిరిసిల్ల - 10° సెంటిగ్రేడ్

  • రంగారెడ్డి - 10° సెంటిగ్రేడ్

  • సిద్దిపేట - 10.1° సెంటిగ్రేడ్


GHMC పరిధిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలివే..

  • BHEL - 11.8° సెంటిగ్రేడ్

  • హైదరాబాద్ విశ్వవిద్యాలయం - 11.8° సెంటిగ్రేడ్

  • శివరాంపల్లి - 12.8° సెంటిగ్రేడ్

  • వెస్ట్ మారేడ్‌పల్లి - 13.2° సెంటిగ్రేడ్

  • జీడిమెట్ల - 13.7° సెంటిగ్రేడ్

  • రాజేంద్రనగర్ - 13.9° సెంటిగ్రేడ్

  • కుత్బుల్లాపూర్ - 14.1° సెంటిగ్రేడ్

  • కార్వాన్ - 14.3° సెంటిగ్రేడ్


అయితే.. వాయువ్య దిశగా వీస్తున్న గాలులు, దిత్వా తుఫాను ప్రభావంగానే రాష్ట్రంలో చలి తీవ్రత అధికమవుతున్నట్టు తెలుస్తోంది. శనివారంతోపాటు ఆదివారమూ ఇవే పరిస్థితులు కొనసాగేలా ఉన్నాయి. దిత్వా తుఫాన్(Ditwah Cyclone) ప్రభావంతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముండటంతో పిల్లలు, వృద్ధులు ఆరోగ్య సలహాలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. అటు ఉదయం పూటా మంచు తీవ్రత ఎక్కువ అవుతుండటంతో వాహనదారులూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


ఇవీ చదవండి:

ఇండియావైపు దూసుకొస్తున్న 'దిత్వా'.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.!

ఎమ్మిగనూరు సమీపంలో రెండు కార్లు ఢీ.. ఐదుగురు మృతి

Updated Date - Nov 29 , 2025 | 12:26 PM