Telangana Local Body Polls: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు మళ్లీ వాయిదా..?
ABN , Publish Date - Sep 08 , 2025 | 06:37 PM
స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర మంత్రివర్గం కొద్దిరోజుల క్రితమే ఆమోదం తెలిపింది. సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ కూడా రాసింది. అయితే..
హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. దీంతో పంచాయతీ, పరిషత్ ఎన్నికలు మరింత ఆలస్యంగా జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రపతి, గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉంది. ఈనెల 30లోపు బిల్లులు ఎటూ తేలకపోతే.. హైకోర్టును ఆశ్రయించి ఎన్నికలకు మరింత గడువు కోరే యోచనలో ప్రభుత్వం ఉంది.
బిహార్ ఎన్నికలు అయిపోయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందట. ఇందుకోసం హైకోర్టును రెండు నుంచి మూడు నెలల గడువు అడిగాలని చూస్తోందట. కాగా, ఆగస్టు 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ భేటీ అయింది. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లలో పరిమితి ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం పేర్లను గవర్నర్‌కు సిఫార్సు చేసింది.
ఇవి కూడా చదవండి
రెచ్చిపోయిన పోలీస్ అధికారి.. బార్ డ్యాన్సర్‌తో కలిసి..
అత్యంత అరుదైన సంఘటన.. మనిషిలా దంతాలు కలిగిన చేప..