ASI Obscene Dance: రెచ్చిపోయిన పోలీస్ అధికారి.. బార్ డ్యాన్సర్‌తో కలిసి..
ABN , Publish Date - Sep 08 , 2025 | 05:02 PM
వైరల్‌గా మారిన వీడియో పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో వారు సంజీవ్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజీవ్‌తో పాటు కానిస్టేబుల్ రాహుల్‌ని కూడా విధుల నుంచి సస్పెండ్ చేశారు.
ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ఓ పోలీస్ అధికారి తప్పుదోవపట్టాడు. తాగుడుకు బానిసై పాడు పనులకు తెరతీశాడు. బార్‌లో రెచ్చిపోయాడు. బార్ డ్యాన్సర్‌తో కలిసి అశ్లీల డ్యాన్సులు చేశాడు. ఇదే అతడి కొంప ముంచింది. ఉద్యోగం ఊడింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో సోమవారం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. దతియా జిల్లాకు సంజీవ్ గౌర్ సివిల్ లైన్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. సంజీవ్ తాగుడుకు బానిస అయ్యాడు. ప్రతీ రోజూ మద్యం తాగేవాడు.
సెప్టెంబర్ 2వ తేదీన అతడి స్టేషన్‌లో పని చేసే కానిస్టేబుల్ రాహుల్ బౌద్ పుట్టిన రోజు వేడుక ఓ హోటల్‌లో జరిగింది. ఈ పుట్టిన రోజు వేడుకలో సంజీవ్ పాల్గొన్నాడు. ఈ కార్యక్రమం కోసం రాహుల్ ఇద్దరు బార్ డ్యాన్సర్లను పిలిపించాడు. వారు డ్యాన్స్ చేస్తూ పార్టీకి వచ్చిన వారిని ఎంటర్‌టైన్ చేస్తూ ఉన్నారు. సంజీవ్ మద్యం మత్తులో రెచ్చిపోయాడు. ఓ బార్ డ్యాన్సర్‌తో కలిసి అశ్లీల డ్యాన్స్‌లు చేశాడు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి దీన్ని వీడియో తీశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైరల్‌గా మారిన వీడియో పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. దీంతో వారు సంజీవ్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజీవ్‌తో పాటు కానిస్టేబుల్ రాహుల్‌ని కూడా విధుల నుంచి సస్పెండ్ చేశారు. సంఘటనపై దర్యాప్తునకు సైతం ఆదేశించారు. దీనిపై జిల్లా ఎస్పీ సురాజ్ వర్మ మాట్లాడుతూ.. ‘పోలీస్ శాఖలో ఇలాంటి ప్రవర్తనను ఏమాత్రం ఉపేక్షించం. పోలీస్ శాఖలో పని చేసే కొంతమంది తప్పు చేయటం వల్ల మొత్తం పోలీస్ శాఖ గౌరవం దెబ్బతింటుంది. తప్పు చేసిన వారికి కఠిన శిక్షలు తప్పవు’ అని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి
అత్యంత అరుదైన సంఘటన.. మనిషిలా దంతాలు కలిగిన చేప..
నేపాల్‌లో తీవ్ర ఉద్రిక్తత.. పార్లమెంట్‌పైకి దూసుకెళ్లిన యువత..