BIG BREAKING: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం
ABN , Publish Date - Sep 22 , 2025 | 12:40 PM
సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దసరా పండుగకు ముందుగానే సింగరేణి కార్మికులకు ప్రభుత్వం బోనస్ ప్రకటించింది.
హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దసరా పండుగకు ముందుగానే సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దానిలో భాగంగా ఒక్కో కార్మికుడికి దసరా కానుకగా రూ. 1,95, 610 ఇస్తున్నట్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు.
ఈ మేరకు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.. సింగరేణి తెలంగాణకు ఆత్మలాంటిదని తెలిపారు. సింగరేణి ఉద్యోగ గనిగా కూడా ఉందని గుర్తు చేశారు. కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో ఉద్యోగి సంక్షేమానికి సగటున రూ. 5 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. లాభాల్లో వాటాను కార్మికులకు పంచుతున్నామని చెప్పుకొచ్చారు. ఈ మేరకు రూ. 2360 కోట్ల లాభంలో 34 శాతం సింగరేణి కార్మికులకు పంచాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూ. 5500 అందజేస్తున్నట్లు వెల్లడించారు. దీపావళికి కూడా కార్మికులకు లాభాల్లో వాటాను పంచుతామని స్పష్టం చేశారు.