Telangana VD: 2047 విజన్ డాక్యుమెంట్ చరిత్రలో నిలిచిపోతుంది: భట్టి విక్రమార్క
ABN , Publish Date - Nov 19 , 2025 | 09:35 PM
తెలంగాణ రాష్ట్ర సామర్థ్యాలు, పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చూపేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. 2047 తెలంగాణ విజన్ డాక్యుమెంట్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
హైదరాబాద్, నవంబర్ 19: తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ చరిత్రలో నిలిచిపోతుందని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్ర ప్రగతి, భవిష్యత్తును ప్రపంచానికి చూపడమే 2047 విజన్ లక్ష్యమన్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో భారీ స్థాయిలో హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించబోతున్నామని, దేశంలోని ప్రముఖులు, ప్రపంచ స్థాయి సీఈఓలకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానాలు పంపిందని ఆయన వెల్లడించారు.
మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యసాధనలో ప్రతి శాఖ కీలక పాత్ర వహించబోతోందని మల్లు వెల్లడించారు. ISB తో కలిసి విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేస్తున్నామని, వార్ రూమ్ కసరత్తు వేగంగా జరుగుతోందని వెల్లడించారు. యువ రాష్ట్రమైన తెలంగాణ సాధించిన రెండేళ్ల ప్రగతిపై ప్రపంచ దృష్టి పడబోతోందని భట్టి విక్రమార్క అన్నారు.
రీజనల్ రింగ్ రోడ్ సహా 36 వేల కోట్ల భారీ ఇన్‌ఫ్రా పనులు వేగవంతమయ్యాయని, ORR–RRR మధ్య 39 రేడియల్ రోడ్లు, కొత్త ఇండస్ట్రియల్ క్లస్టర్ల ఏర్పాటు చేస్తున్నామని మల్లు తెలిపారు. రెండేళ్లలో 85 వేల కోట్ల విలువైన రోడ్లు–భవనాల పనులు ప్రారంభమవ్వబోతున్నాయని, డ్వాక్రా మహిళలకు ఐదేళ్లలో 27 వేల కోట్లు వడ్డీ రహిత రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఉపముఖ్యమంత్రి తెలిపారు.
రీజనల్ రింగ్ రోడ్ సహా 36 వేల కోట్ల భారీ ఇన్‌ఫ్రా పనులు వేగవంతమయ్యాయని, ORR–RRR మధ్య 39 రేడియల్ రోడ్లు, కొత్త ఇండస్ట్రియల్ క్లస్టర్ల ఏర్పాటు చేస్తున్నామని మల్లు తెలిపారు. రెండేళ్లలో 85 వేల కోట్ల విలువైన రోడ్లు–భవనాల పనులు ప్రారంభమవ్వబోతున్నాయని, డ్వాక్రా మహిళలకు ఐదేళ్లలో 27 వేల కోట్లు వడ్డీ రహిత రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఉపముఖ్యమంత్రి తెలిపారు..