Share News

Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఎమ్మెల్సీ కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు

ABN , Publish Date - Aug 13 , 2025 | 04:52 PM

ఢిల్లీ: సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గవర్నర్ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు చేస్తూ.. సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఎమ్మెల్సీ కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు
Supreme Court

ఢిల్లీ: సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గవర్నర్ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు చేస్తూ.. సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్‌లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.


రెండు ఎమ్మెల్సీ స్థానాలలో తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకి లోబడే ఉంటాయని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. కోదండరాం, అలీఖాన్‌లు తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియామకం అయిన విషయం తెలిసిందే. అయితే వీరి నియామకం అక్రమంగా జరిగిందని.. దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు గవర్నర్‌కు తెలిపారు. గవర్నర్ వీరి వాదనను తిరస్కరించడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి నియామకాలపై విచారణ జరిపి నియామకాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంను కోరారు.


ఈ మేరకు ఇవాళ(బుధవారం) విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. ఆగస్టు 14, 2024 తీర్పులో మార్పులు చేస్తూ.. వారి నియామకం చెల్లదని తీర్పును వెలువరించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది.


అయితే ఈ విషయంపై తాజాగా ఎమ్మెల్సీ ఆమీర్ అలీఖాన్ స్పందించారు. సుప్రీం కోర్టు ఈ విధమైన తీర్పు ఇస్తుందని అనుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. కోర్టు ఆర్డర్ చదివిన తర్వాత అన్ని మాట్లాడుతానని పేర్కొన్నారు. కాసేపటి క్రితమే లాయర్ కాల్ చేసి సుప్రీం కోర్టులో జరిగిన విషయాలు చెప్పారని వివరించారు. తాను మొన్నటి వరకు జర్నలిస్టును అని ఎలాంటి రాజకీయం బ్యాక్ గ్రౌండ్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనతో ఇంకా ప్రభుత్వ పెద్దలు మాట్లాడలేదని అలీఖాన్ స్పష్టం చేశారు.

Updated Date - Aug 13 , 2025 | 05:11 PM