Son Killed Mother: బీమా డబ్బుల కోసం కన్నతల్లిని కడతేర్చిన కొడుకు..
ABN , Publish Date - Aug 21 , 2025 | 11:50 AM
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గ్రామంలో ఓ కసాయి కొడుకు తల్లిని హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ పాలసీ డబ్బుల కోసం గ్రామానికి చెందిన చాకలి రాజు మాతృత్వాన్ని మరచి తన తల్లి జమునను హతమార్చాడు.
కామారెడ్డి: మనుషుల్లో మానవత్వం అడుగంటి పోయింది. వావి వరసలు లేకుండా.. ఆగయిత్యాలకు పాల్పడుతూ.. ఆస్తీ, డబ్బుల కోసం నా అనుకున్న వారిపైనే దారుణాలు చేస్తున్నారు. మానవత్వం మరిచి మానవ మృగాలుగా మారుతున్నారు. దేని కోసం ఎందుకోసం చేస్తున్నారో కూడా.. తెలియకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు. తాత్కాలిక అవసరాలకు, ఆనందాలకు అలవాటుపడి తాము మనుషులమే అన్న నిజాన్ని మరిచి మృగాలుగా వ్యవహరిస్తున్నారు. ఆస్తుల కోసం కన్నతల్లిదండ్రులు, తోబుట్టువులుపై కూడా దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఓ ఘటనే.. కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గ్రామంలో ఓ కసాయి కొడుకు తల్లిని హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ పాలసీ డబ్బుల కోసం గ్రామానికి చెందిన చాకలి రాజు మాతృత్వాన్ని మరచి తన కన్నతల్లి జమునను హతమార్చాడు. అనంతరం జమున ప్రమాదవశాత్తు చనిపోయినట్లు చిత్రీకరించి గ్రామస్తులను నమ్మించాడు. అయితే రాజు ముందుగానే తన తల్లిని చంపాలని నిర్ణయించుకుని జమునపై ఆరు ఇన్సూరెన్స్ కంపెనీలలో ఇన్సూరెన్స్ చేయించినట్లు పోలీసులు గుర్తించారు. తన తల్లి మరణం అనంతరం రెండు కంపెనీల నుంచి రూ. 80 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నట్లు తెలిపారు. మరో కేసులో నిందితుడిగా ఉన్న రాజును విచారించే సమయంలో తన తల్లి హత్య ఉదంతం బయటకు వచ్చిందని పోలీసులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అర్హులైన చేనేతలందరికీ ముద్ర రుణాలు
శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక