Share News

Colleges To Shutdown In T'Gana: ఈ నెల 6 నుంచి కాలేజీలు బంద్!

ABN , Publish Date - Oct 01 , 2025 | 09:10 AM

తెలంగాణలో మరోసారి బంద్ దిశగా ప్రైవేట్ కాలేజీలు అడుగులు వేస్తున్నాయి. ఫీజు బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడంతో ఈ నెల 6 నుంచి బంద్ కు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు పిలుపునిచ్చాయి

Colleges To Shutdown In T'Gana: ఈ నెల 6 నుంచి కాలేజీలు బంద్!

Telangana Colleges To Shutdown: తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు మరోసారి బంద్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ నెల 6 నుంచి కాలేజీల బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఈరోజు అన్ని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు అత్యవసరంగా సమావేశం కానున్నాయి. పెండింగ్ బకాయిలపై కార్యాచరణను ఈ భేటీలో రూపొందించనున్నారు. కాగా ఇటీవల రీయంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 15 నుండి నిరవధిక బంధ్ కు కాలేజీల యాజమాన్యాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

మాట తప్పారు?..

కాలేజీలు బంద్ కు పిలుపునివ్వడంతో విద్యార్థుల చదువుపై ప్రభావం చూపుతుందనే నేపథ్యంలో ప్రభుత్వం కాలేజీల యాజమాన్యాలతో చర్చలు జరిపింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన చర్చలకు సానుకూలంగా స్పందించి బంద్ పిలుపునకు వెనక్కి తగ్గాయి. ప్రభుత్వంతో చర్చల అనంతరం దసరా, దీపావళిలోగా పెండింగ్ లో ఉన్నమొత్తం బకాయిల్లో రూ.600 కోట్లను విడుదల చేయనున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటన చేశారు.

అయితే.. ఈ ప్రకటన వెలువడి రెండు వారాలు గడుస్తున్నా.. ప్రభుత్వం ఇంకా పెండింగ్ బిల్లులను విడుదల చేయలేదు. దీంతో మరోసారి ఆందోళన బాట పట్టేందుకు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఫెడరేషన్ అఫ్ అసోసియేషన్స్ అఫ్ తెలంగాణ హైయ్యర్ ఎడ్యుకేషన్స్ ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు అత్యవసర మీటింగ్ జరగనుంది. ఈ సమావేశం అనంతరం కాలేజీల బంద్ పై ఒక క్లారిటీ రానుంది. అయితే కాలేజీలు బంద్ అవ్వుతానే ప్రచారంతో తమ పిల్లల చదువుపై ప్రభావం చూపుతుందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

రూ.485కే 72 రోజుల ప్లాన్..అన్‌లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ డేటా

Updated Date - Oct 01 , 2025 | 09:41 AM