Share News

TS New Ministers Portfolios: కొత్త తెలంగాణ మంత్రుల్ని వరించేవి ఈ శాఖలేనా?

ABN , Publish Date - Jun 08 , 2025 | 06:43 PM

ఎవరికి ఏ శాఖ కేటాయించాలనే దానిపై కసరత్తు దాదాపు పూర్తి కావొచ్చినట్టు సమాచారం. ఈ రాత్రి వరకు పోర్ట్పోలియోల పై అధికారిక ప్రకటన వెలువడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న హోం, మున్సిపల్, విద్యా, కమర్షియల్ శాఖలతో పాటు వెల్ఫేర్ శాఖలు కేటాయిస్తారా?

TS New Ministers Portfolios: కొత్త తెలంగాణ మంత్రుల్ని వరించేవి ఈ శాఖలేనా?
TS New Ministers Portfolios

ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ కొత్త మంత్రులకు పోర్ట్పోలియోల కేటాయింపులపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ఈ రాత్రికి శాఖల కేటాయింపు అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, సెక్రటేరియట్‌లో ఛాంబర్లను సాధారణ పరిపాలన శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. రేపు కొత్తగా ఎంపికైన మంత్రులు ఛార్జ్ తీసుకోబోతున్నారు.

CM-revanth-cabinet.jpg


ఇక, ఎవరికి ఏ శాఖ కేటాయించాలనే దానిపై కసరత్తు దాదాపు పూర్తి కావొచ్చినట్టు సమాచారం. ఈ రాత్రి వరకు పోర్ట్పోలియోల పై అధికారిక ప్రకటన వెలువడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న హోం, మున్సిపల్, విద్యా, కమర్షియల్ శాఖలతో పాటు వెల్ఫేర్ శాఖలు కేటాయిస్తారా? లేదా మంత్రుల శాఖల్లో మార్పు జరుగుతుందా? అనేది తేలాల్సి ఉంది.

CM-Revanth-Cabinet-4.jpg


మరోవైపు, కొత్త మంత్రుల శాఖలపై జోరుగా ఊహగానాలు జరుగుతున్నాయి. గడ్డం వివేక్‌కు స్పోర్ట్స్ అండ్ యువజన సర్వీసులు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు లేబర్ అండ్ ఎస్సీ వెల్ఫేర్ శాఖ కేటాయించే ఛాన్స్ ఉంది.

CM-Revanth-Cabinet-2.jpgఇక, వాకాటి శ్రీహరికి న్యాయ, పశుసంవర్ధక శాఖ కేటాయించే అవకాశం ఉన్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. మరికాసేపట్లో శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు అధికారికంగా వెలువడనున్నాయి.

CM-Revanth-Cabinet-3.jpg


జర్నలిస్ట్ కృష్ణంరాజు, సాక్షి మీడియాపై పోలీసులకు అమరావతి రైతుల ఫిర్యాదు

బీచ్ ఫెస్టివల్‌కు ఊహకు అందని విధంగా పర్యాటకులు

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 08 , 2025 | 06:43 PM