Share News

HYD Heavy Rains: అవసరమైతే తప్ప బయటకు రాకండి.. GHMC హెచ్చరిక..

ABN , Publish Date - Aug 11 , 2025 | 06:31 PM

నగరంలో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఎస్‌ఆర్‌నగర్‌, ఎర్రగడ్డ, మూసాపేట్‌లో భారీ వర్షం పడుతుంది.

HYD Heavy Rains: అవసరమైతే తప్ప బయటకు రాకండి.. GHMC హెచ్చరిక..
Heavy Rains

హైదరాబాద్: నగరంలో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఎస్‌ఆర్‌నగర్‌, ఎర్రగడ్డ, మూసాపేట్‌లో భారీ వర్షం పడుతుంది. కుత్బుల్లాపూర్‌, ఎల్బీనగర్‌, ఉప్పల్‌లో మోస్తారు వర్షం కురుస్తున్నట్లు సమాచారం. వర్షాలతో ఎక్కడికక్కడ మెట్రో స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. రహదారులన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో మాన్సూన్‌ బృందాలు అప్రమత్తమయ్యాయి.


ఇక హైదరాబాదు మహానగరంలో భారీ వర్షాల నేపథ్యంలో సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు ఇవే..

  • ఎన్డీఆర్ఎఫ్ నెం: 8333068536,

  • ఐసీసీసీ: 8712596106.

  • హైడ్రా: 9154170992

  • ట్రాఫిక్:‌ 8712660600

  • సైబరాబాద్‌ 8500411111

  • రాచకొండ 8712662999.

  • TGSPDCL ఫోన్‌ నెం.7901530966.

  • RTC 9444097000.

  • GHMC ఫోన్‌ నె.8125971221.

  • HMWSSB 9949930003.

Updated Date - Aug 11 , 2025 | 06:44 PM