Shocking facts in Soundarya Death: సౌందర్య మరణం.. నిమిషాల్లోనే అంతా అయిపోయింది..
ABN , Publish Date - Mar 12 , 2025 | 04:12 PM
సినీ నటి సౌందర్య చనిపోవడానికి ముందు ఏం జరిగింది. కర్ణాటకకు నుంచి ఆమె ఎక్కడకు బయలుదేరారు. విమానం టేకాఫ్ అయిన ఎంతసేపటికి ఆమె మరణించారు.

సావిత్రి తర్వాత తెలుగులో అంత క్రేజ్ ఉన్న నటి ఎవరన్నా ఉన్నారంటే.. అది కచ్చితంగా సౌందర్యనే అని చెప్పాలి. అందం, అభినయంతో కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు.. కన్నడ, తమిళం, హిందీ ప్రేక్షకులను కూడా మెప్పించింది. దశాబ్దానికి పైగా హీరోలతో సరిసమానమైన క్రేజ్‌తో ఓ వెలుగు వెలిగింది. అలాంటి టైమ్‌లో ఊహించని విధంగా .. అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురై పేలి పోయింది. ఆ ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె అన్న, మరో ఇద్దరు కూడా కాలి బూడిద అయిపోయారు. ఈ విషాద సంఘటన జరిగి దాదాపు 20 ఏళ్లు పైనే అవుతోంది. ఇప్పటికీ కూడా ఆమె అభిమానులు ఆ సంఘటనను మర్చిపోలేకపోతున్నారు. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది?.. హెలికాఫ్టర్ పేలడానికి అసలు కారణం ఏమిటి
నిమిషాల్లోనే..
2004, ఏప్రిల్ 17వ తేదీన సౌందర్య సెస్నా 180 హెలికాఫ్టర్ లో బెంగళూరు నుంచి కరీంనగర్ బయలుదేరింది. ఆ హెలికాఫ్టర్‌లో సౌందర్యతో పాటు ఆమె అన్న అమర్నాథ్, బీజేపీ కార్యకర్త రమేష్ కదమ్ ఉన్నారు. సౌందర్య బీజేపీ తరపున ప్రచారం చేయడానికి బెంగళూరు నుంచి కరీంనగర్ వస్తున్నారు. ఉదయం 11.05 నిమిషాలకు జక్కూర్ లోని ఎయిర్ స్ట్రిప్స్ నుంచి హెలికాఫ్టర్ టేకాఫ్ అయింది. హెలికాఫ్టర్ గాల్లోకి లేచింది. సాంకేతిక లోపం కారణంగా 150 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులోకి వెళ్లలేకపోయింది. పైలట్ జాయ్ ఫిలిప్ హెలికాఫ్టర్‌ను కొద్దిగా ఎడమ వైపు తిప్పాడు. అంతే..ఇంజిన్ పనిచేయడం మానేసింది. ఆ వెంటనే హెలికాఫ్టర్లో మంటలు చెలరేగాయి.
మంటలు మొదలైన కొన్ని క్షణాలకే హెలికాఫ్టర్ రివ్వున చక్కర్లు కొడుతూ నేలపై పడి పేలిపోయింది. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఇదంతా జరిగింది. ఈ ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె అన్న అమర్నాథ్, రమేష్, జాయ్ ఫిలిప్ అక్కడికక్కడే కాలి బూడిదయ్యారు. ఎవరి శరీర భాగాలు ఎవరివో కనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇక్కడ అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే.. ప్రమాదం జరిగిన సమయానికి సౌందర్య గర్భంతో ఉంది. సౌందర్యతో పాటు ఆమె కడుపులోని బిడ్డ కూడా ఈ ప్రపంచాన్ని చూడకుండానే కన్నుమూసింది. ఈ ప్రమాదం జరిగి వచ్చే నెలకు రెండు దశాబ్దాలు పూర్తికానున్న నేపథ్యంలో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి...
Borugadda Anil: ఏపీ హైకోర్టు సీరియస్..లొంగిపోయిన బోరుగడ్డ
AP Legislative Council: సభ మొదలవగానే షూరూ చేసిన వైసీపీ..
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here