Hyderabad Drug Overdose: ఫుల్‌గా డ్రగ్స్ తీసుకున్నాడు.. చివరకు చూడగా..
ABN , Publish Date - Nov 06 , 2025 | 10:52 AM
మొబైల్ రిపేర్ బిజినెస్ చేస్తున్న అలీ డ్రగ్స్‌కు బానిసగా మారాడు. డ్రగ్స్ తీసుకోకుండా ఉండలేని పరిస్థితికి వచ్చాడు. ఈక్రమంలో నిన్న ఒక అపార్ట్‌మెంట్‌లో అలీ డ్రగ్స్ సేవించాడు.
హైదరాబాద్, నవంబర్ 6: డ్రగ్స్ భూతం యువతను పట్టిపీడిస్తోంది. డ్రగ్స్‌కు అనేక మంది యువత బానిసలుగా మారిపోతున్నారు. ఎక్కడపడితే అక్కడ డ్రగ్స్ ఈజీగా లభ్యం అవుతుండడంతో యువత డ్రగ్స్‌ను విచ్చలవిడిగా వాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న అనేక మంది డ్రగ్స్ భూతానికి బలైపోతున్నారు. తమ బంగారు భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటూ తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో తరచుగా డ్రగ్స్ పట్టుబడటం కూడా తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏదో ఒక విధంగా సిటీలోకి డ్రగ్స్ ఎంటరవుతూనే ఉంది. తాజాగా డ్రగ్స్ తీసుకుని ఓ వ్యక్తి మరణించడం సంచలనంగా మారింది.
డ్రగ్స్ ఓవర్ డోస్‌తో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రాజేంద్రనగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మొబైల్ రిపేర్ బిజినెస్ చేస్తున్న అలీ డ్రగ్స్‌కు బానిసగా మారాడు. డ్రగ్స్ తీసుకోకుండా ఉండలేని పరిస్థితికి వచ్చాడు. ఈ క్రమంలో నిన్న ఒక అపార్ట్‌మెంట్‌లో అలీ డ్రగ్స్ సేవించాడు. అయితే డ్రగ్స్ ఓవర్ డోస్‌గా తీసుకోవడంతో అలీ ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలిసిన వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు అలీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది?... ఎవరి దగ్గర తీసుకున్నాడు? అలీకి డ్రగ్స్‌ను ఎవరు విక్రయించారు? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
అసభ్యకరంగా ట్రోలింగ్.. సీపీకి సింగర్ చిన్మయి ఫిర్యాదు
Read Latest Telangana News And Telugu News