Share News

Kacheguda Railway station: రైల్వే ప్రయాణికుడికి తృటిలో తప్పిన ప్రమాదం.. నెట్టింట వీడియో వైరల్

ABN , Publish Date - Nov 20 , 2025 | 05:19 PM

కదిలే రైలు దిగుతూ ప్రమాదంలో పడ్డ ప్రయాణికుడిని ఓ ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ కాపాడారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Kacheguda Railway station: రైల్వే ప్రయాణికుడికి తృటిలో తప్పిన ప్రమాదం.. నెట్టింట వీడియో వైరల్
Kacheguda Railway Station Passenger Rescued

ఇంటర్నెట్ డెస్క్: రైల్వే ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులు నిత్యం ప్రజలను అప్రమత్తం చేస్తుంటారు. అయితే, ఈ హితవచనాలను కొందరు పెడచెవిన పెట్టి ఇబ్బందుల్లో పడుతుంటారు. తాజాగా కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఓ ప్రయాణికుడు కదిలే రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించి చిక్కుల్లో పడ్డాడు. అయితే, ఓ ఆర్‌ఫీఎఫ్ కానిస్టేబుల్ వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది (Kacheguda Railwaystation Viral Video).

స్టేషన్‌లో రైలు ఆగుతున్న క్రమంలో ఓ ప్రయాణికుడు తొందరపడి దిగేందుకు ప్రయత్నించాడు. రైలు పూర్తిగా ఆగక మునుపే దిగడంతో అతడు జారి ప్లాట్‌ఫాంపై పడ్డాడు. ప్రయాణికుడు రైలు కిందకు జారిపోతుండటాన్ని గమనించిన ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ పవన్ కుమార్ శర్మ వేగంగా స్పందించి అతడిని కాపాడాడు. ప్రయాణికుడి చేయి పట్టి వెనక్కు లాగడంతో పెనుప్రమాదం తృటిలో తప్పిపోయింది


కాచిగూడ స్టేషన్‌లో ఇటీవలే ఇలాంటి మరో ఘటన జరిగింది. అక్టోబర్‌ 28న ఓ ప్రయాణికుడు తను ఎక్కవలిసిన రైలు కాక పొరపాటున మరో రైలు ఎక్కాడు. అప్పటికే రైలు బయలుదేరడంతో కంగారుపడి ప్లాట్‌ఫామ్‌పై దిగాడు. ఈ క్రమంలో కాలు జారడంతో ప్రయాణికుడు కంగారులో బోగీకి ఉన్న రాడ్డును గట్టిగా పట్టుకోవడంతో అతడిని రైలు కొంత దూరం లాక్కెళ్లింది. అప్పటికే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ప్రమాదం జరిగే లోపే అతడిని కాపాడారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కుప్పం ప్రజలకు అండగా ఉంటాం: నారా భువనేశ్వరి

ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుంది.. ఏపీ డీజీపీ స్పష్టం

Read Latest TG News And Telugu News

Updated Date - Nov 20 , 2025 | 06:07 PM