Inhuman incident: హైదరాబాద్‌లో అమానుషం.. చిన్నారిని ఇంటికి పిలిచి.. ఆపై దారుణంగా..
ABN , Publish Date - Oct 10 , 2025 | 09:14 AM
సమాజంలో చిన్నారులకు రక్షణ లేకుండా పోతోంది. ముక్కుపచ్చలారని చిన్నారులను సైతం కామాంధులు వదలడం లేదు. ఎంతో భవిష్యత్తు ఉన్న వారు కామాంధుల బారిన పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. సైదాబాద్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
హైదరాబాద్, అక్టోబరు10(ఆంధ్రజ్యోతి): సమాజంలో చిన్నారులకు రక్షణ లేకుండా పోతోంది. ముక్కుపచ్చలారని చిన్నారులను సైతం కామాంధులు వదలడం లేదు. ఎంతో భవిష్యత్తు ఉన్న వారు కామాంధుల బారిన పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. సైదాబాద్ (Saidabad) పరిధిలో ఈ ఘటన జరిగింది. గంజాయి మత్తులో ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు దుండగుడు. 15 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... సైదాబాద్ పరిధిలో కూతురు(8), కుమారుడు(7)లతో ఓ కుటుంబం నివసిస్తోంది.
కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని దంపతులు పోషించుకుంటున్నారు. దంపతులిద్దరూ కూలీ పనులకు వెళ్లిన సమయంలో, ఇద్దరు చిన్నారులను ఇంటికి పిలిచాడు సదరు యువకుడు. సోదరుడి ముందే బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని చిన్నారులను బెదిరించాడు నిందితుడు.
ఈ క్రమంలో బాలిక అనారోగ్యానికి గురవ్వడంతో ఈ విషయం బయట పడింది. ఈ విషయం గురించి ఆరా తీయగా తల్లిదండ్రులకు వాస్తవాన్ని చెప్పాడు చిన్నారి తమ్ముడు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సహాయంతో సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు సైదాబాద్ పోలీసులు.
ఈ వార్తలు కూడా చదవండి..
లాలాగూడలో వాలీబాల్ కోచ్ వేధింపులు.. యువతి ఆత్మహత్యాయత్నం
తెలంగాణలో కొత్త పోలీసింగ్ విధానం.. డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Read Latest Telangana News and National News