Ibomma Ravi Custody: మరోసారి కస్టడీకి ఐబొమ్మ రవి
ABN , Publish Date - Nov 27 , 2025 | 01:25 PM
ఐబొమ్మ రవిని మరోసారి సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు రవిని విచారించనున్నారు.
హైదరాబాద్, నవంబర్ 27: ఐబొమ్మ రవిని (Ibomma Ravi) మరోసారి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రవిని మూడు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ నిన్న (బుధవారం) నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈరోజు (గురువారం) ఉదయం చంచల్‌గూడ జైలులో రవిని కస్టడీలోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు.. అక్కడి నుంచి బషీర్ బాగ్ సీసీఎస్‌కు తరలించారు. రెండోసారి రవిని సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. మూడు రోజుల పాటు విచారించనున్నారు. ఇప్పటికే ఐదు రోజుల పాటు రవిని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించిన విషయం తెలిసిందే.
గత విచారణలో రవి సహకరించకపోవడంతో మరో 3 రోజులు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. ఎన్జెలా సర్వర్‌లో మాస్క్ ఐపీలపై , బెట్టింగ్ యాప్స్ నుంచి జరిగిన లావాదేవీలపై పోలీసులు విచారించనున్నారు. బెట్టింగ్ యాప్ లావాదేవీలు, డొమైన్స్ ఇన్వాయిస్‌ల ఆధారంగా రవిని విచారించనున్నారు. ఐబొమ్మకు సంబంధించిన ఆధారాలను ముందు ఉంచి రవి నుంచి సమాచారం సేకరించాలని సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి...
రిజర్వేషన్లపై హైకోర్టులో పిల్.. రేపు విచారణకు ఛాన్స్
గ్రూప్ 2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్
Read Latest Telangana News And Telugu News