Share News

Paradise Tea Point Bakery: ప్యారడైజ్ బేకరీలో ఎలుక స్వైర విహారం.. ఫుడ్ సేఫ్టీ అధికారులకు కస్టమర్లు ఫిర్యాదు

ABN , Publish Date - Nov 12 , 2025 | 05:36 PM

నెక్లెస్ రోడ్డులోని ప్యారడైజ్ టీ పాయింట్ బేకరీలో ఆహార పదార్థాలపై ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ విషయాన్ని బేకరీ సిబ్బంది దృష్టికి తీసుకు వెళ్లితే.. వారి నుంచి నిర్లక్ష్యంగా సమాధానం వస్తుంది. దీంతో కస్టమర్లు.. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Paradise Tea Point Bakery: ప్యారడైజ్ బేకరీలో ఎలుక స్వైర విహారం.. ఫుడ్ సేఫ్టీ అధికారులకు కస్టమర్లు ఫిర్యాదు

హైదరాబాద్, నవంబర్ 12: నెకెస్ల్ రోడ్డు ఐ మ్యాక్స్ థియేటర్ సమీపంలోని ప్యారడైజ్ టీ పాయింట్ బేకరీ ఐటమ్స్‌లో ఎలుకలు తిరుగుతున్నాయి. ఈ విషయాన్ని బేకరీ సిబ్బంది పట్టించుకోవడం లేదు. దీనిని గుర్తించి బేకరి సిబ్బందిని ప్రశ్నిస్తే.. వారి నుంచి నిర్లక్ష్యంగా సమాధానం వస్తుందని కస్టమర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆహార పదార్ధాలపై ఎలుకలు తిరిగితే ఏమవుతుందంటూ? నిర్లక్ష్యంగా అంటున్నారని చెబుతున్నారు. బేకరీలో ఎలుక స్వైర విహారంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించాలని కస్టమర్లు కోరుతున్నారు.


ఆహార పదార్థాలపై ఎలుకలు తిరగడం పట్ల కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని బేకరీ యాజమాన్యం దృష్టికి తీసుకు వెళ్లినా.. వారు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలుకలు తిరిగే ఏం అవుతుందంటూ ఎదురు ప్రశ్న వేస్తు్న్నారని అంటున్నారు. హైదరాబాద్ నగరంలో బ్రాండెడ్ హోటల్‌గా ప్యారడైజ్‌కు పేరందని గుర్తు చేస్తున్నారు. అలాంటి హోటల్‌లో ఇలా ఎలుకలు యథేచ్ఛగా తిరిగితే.. కస్టమర్ల ఆరోగ్య పరిస్థితి ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


అదికాక కస్టమర్ల ఆరోగ్యం కోసం రక్షణ చర్యలు చేపట్టకుండా హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులకు వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అదీకాక ఈ ప్రాంతం అత్యంత రద్దీ ప్రాంతమని ఈ సందర్భంగా పేర్కొంటున్నారు. నిత్యం వేలాది మంది ఈ బ్యాకరీకి వస్తారని వివరిస్తున్నారు. అలాంటి వేళ ఆహార పదార్థాలపై ఇలా ఎలుకలు, బొద్దింకలు తిరిగితే తమ ఆరోగ్య పరిస్థితి ఏమిటని కస్టమర్ల ఆందోళనతో ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Nov 12 , 2025 | 06:34 PM