Share News

HYD Heavy Rain: మహానగరంలో భారీ వర్షం.. జలమయమైన రోడ్లు, లోతట్టు ప్రాంతాలు..

ABN , Publish Date - Aug 09 , 2025 | 09:53 PM

ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, తార్నాక, రామంతాపూర్‌, అబిడ్స్‌, చార్మినార్‌లో భారీ వర్షం పడుతుంది. అలాగే మాదాపూర్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, బంజారాహిల్స్ సహా పలు ప్రాంతాల్లో కుంభవర్షం కురుస్తోంది.

HYD Heavy Rain: మహానగరంలో భారీ వర్షం.. జలమయమైన రోడ్లు, లోతట్టు ప్రాంతాలు..
Rain Allert..

హైదరాబాద్: నగరంలో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. దీంతో జన సంచారం పూర్తిగా స్థంభించిపోయింది. ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, తార్నాక, రామంతాపూర్‌, అబిడ్స్‌, చార్మినార్‌లో భారీ వర్షం పడుతుంది. అలాగే మాదాపూర్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, బంజారాహిల్స్ సహా పలు ప్రాంతాల్లో కుంభవర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.


ఇవాళ్టి(శనివారం) నుంచి 15వ తేదీ వరకూ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా, భారీ వర్షం కారణంగా రోడ్లపై వాహనాలు నిలిపోయాయి. ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాలనీలు అన్ని జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగరవాసులు తమ ప్రయాణాన్ని వాతావరణానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.


వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. GHMC, పోలీసులు, హైడ్రా విభాగాల అధికారులు సహా కలెక్టర్లను అప్రమత్తం చేసింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించింది. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించింది. అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ.. ప్రజల రక్షణకు చర్యలు తీసుకోవాలని తెలిపింది. వెంటనే ముందుజాగ్రత్త చర్యలు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - Aug 09 , 2025 | 10:17 PM