Share News

Police Frisking In Train: HYD రైలులో ఉగ్రవాదులు.. పోలీసులు తనిఖీలు

ABN , Publish Date - Sep 26 , 2025 | 11:15 AM

హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఉగ్రవాదులున్నారంటూ పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఘట్‌కేసరి రైల్వే స్టేషన్‌లో ఈ రైలును నిలిపి వేసి తనిఖీలు చేపట్టారు.

Police Frisking In Train: HYD రైలులో ఉగ్రవాదులు.. పోలీసులు తనిఖీలు

హైదరాబాద్, సెప్టెంబర్ 26: హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఉగ్రవాదులున్నారంటూ రైల్వే పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఘట్‌కేసరి రైల్వే స్టేషన్‌లో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ రైలును నిలిపివేశారు. అనంతరం స్థానిక పోలీసుల సహాయంలో రైల్వే బోగీలలో ముమ్మర తనిఖీలు చేపట్టారు.


అందులో భాగంగా జనరల్, స్లీపర్, ఏసీ బోగీల్లో అణువణువు తనిఖీలు చేపట్టారు. ఆ క్రమంలో సందేహాస్పదంగా కనిపించిన వారిని గుర్తింపు కార్డులు చూపించాలని పోలీసులు కోరారు. ఈ సందర్బంగా అనుమానాస్పదంగా ఉన్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారి సైతం వ్యక్తిగత వివరాలు వెల్లడించారు.


అయితే తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కానీ.. వస్తువులు కానీ లేకపోవడంతో.. ప్రయాణికులతోపాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఫేక్ కాల్ అని పోలీసులు ఈ సందర్భంగా నిర్దారించారు. మరోవైపు రైలు నిలిపివేయడంతో.. అందులోని ప్రయాణికులు.. ముఖ్యంగా చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ఆలస్యంగా చేరుకుంది.

Updated Date - Sep 26 , 2025 | 11:58 AM