Weekend Special Drive: వీకెండ్ డ్రంకెన్ డ్రైవ్ స్పెషల్.. చిక్కిన మందు బాబులు..
ABN , Publish Date - Dec 22 , 2025 | 11:05 AM
హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో పోలీసులు వీకెండ్ స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 403 మంది, సైబరాబాద్‌లో 409 మంది పట్టుబడ్డారని, వారిపై కేసులు నమోదు చేశామని అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు.
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో పోలీసులు వీకెండ్ స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 403 మంది, సైబరాబాద్‌లో 409 మంది పట్టుబడ్డారని, వారిపై కేసులు నమోదు చేశామని అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. హైదరాబాద్ లో పట్టుబడిన వారిలో 320 మంది ద్విచక్రవాహనదారులు, 23 మంది ఆటో డ్రైవర్లు, 59 మంది కార్లు, భారీ వాహనాల డ్రైవర్లు ఉన్నారు. సైబరాబాద్ లో 290మంది ద్విచక్రవాహనదారులు, 23మంది ఆటో డ్రైవర్లు, 95 మంది కార్లు నడుపుతున్న వారు, భారీ వాహనం డ్రైవర్ ఉన్నారని పేర్కొన్నారు. సైబరాబాద్ కేసులను విచారించిన న్యాయస్థానం ఇద్దరికి జరిమానా, జైలు శిక్ష, సామాజిక సేవ చేయాలని తీర్పు చెప్పిందని పోలీసులు తెలిపారు.