Heavy Rains: నగరంలో భారీ వర్షం.. హెచ్చరించిన జీహెచ్ఎంసీ
ABN , Publish Date - Apr 10 , 2025 | 05:39 PM
Heavy Rains: హైదరాాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలుతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో పెద్ద పెద్ద చెట్టు విరిగిపడిపోతున్నట్లు మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. అలాంటి వేళ.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్పందించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

హైదరాబాద్, ఏప్రిల్ 10: వేసవి కాలం. ఎండలు మండిపోతున్నాయి. దీంతో హైదరాబాద్ నగర జీవికి ఉక్క పోతతో ఓ విధమైన అసౌకర్యానికి గురవుతున్నాడు. అలాంటి వేళ.. హైదరాబాద్ మహానగరంలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. ఈ గాలి దుమారానికి పలు ప్రాంతాల్లోని భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) హెచ్చరించింది.
అలాగే భారీ వర్షాలు, ఈదరుగాలులు నేపథ్యంలో మాన్‌సూన్, డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు వివరించింది. విపత్కర పరిస్థితులు ఎదురైతే.. వెంటనే జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 040-2111-1111కు కాల్ చేయాలని నగర వాసులకు సూచించింది. ఆఫీసులు ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లే వాహనదారులు చాలా జాగ్రత్తతో వెళ్లాలని అప్రమత్తం చేసింది. అలాగే కరెంట్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద నిలువ వద్దని ప్రజలకు తెలిపింది.
ఇక హైటెక్స్, గచ్చిబౌలి ప్రాంతంలోని ఐటీ కారిడార్‌లోని ఉద్యోగాలు ఒకే సారి రోడ్లపైకి రావొద్దని నగర ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఓ వేళ మీరు వెళ్లే రహదారుల్లో భారీగా ట్రాఫిక్ ఉంటే.. 100కు కాల్ చేసి.. మీరు ఏ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారో చెబితే.. ఆ పీఎస్ పరిధిలోని పోలీసులు నిమిషాల్లో అక్కడి చేరుకొని.. ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తారని ట్రాఫిక్ విభాగం పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.
For Telangana News AND Telugu News