Telangana Raising: డిసెంబర్ 8,9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025
ABN , Publish Date - Nov 14 , 2025 | 07:49 PM
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 పేరిట సీఎం రేవంత్ రెడ్డి సర్కారు హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహించబోతోంది. ప్రపంచ స్థాయిలో రాష్ట్ర అభివృద్ధి, వ్యాపార, ఆర్థిక రంగాలలో ప్రగతిని చర్చించేందుకు..
హైదరాబాద్, నవంబర్ 14: డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నిర్వహించబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ సమ్మిట్ గురించి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, డీజీపీ శివధర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొని పలు అంశాల మీద చర్చించారు.

సమీక్షలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారంటే.. 'ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా Telanaga Rising Global Summit - 2025 నిర్వహించుకుంటున్నాం. డిసెంబర్ 8న ప్రజా ప్రభుత్వ రెండో వార్షికోత్సవం వైభవంగా నిర్వహించాలి. డిసెంబర్ 9 న Telanga Rising-2047 పాలసీ డాక్యుమెంట్ ను ఆవిష్కరించుకోబోతున్నాం. తెలంగాణ భవిష్యత్ కు రోడ్ మ్యాప్ రూపొందించుకోబోతున్నాం. పాలసీ ఆధారంగానే భవిష్యత్ నిర్ణయాలను తీసుకునేందుకు వీలుంటుంది. పాలసీ డాక్యుమెంట్ తో పెట్టుబడిదారులకు ఒక స్పష్టత వస్తుంది. శాఖల వారీగా పాలసీలకు సంబంధించి సమ్మిట్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఈ నెలాఖరులోగా శాఖల వారీగా పాలసీ డాక్యుమెంట్ సిద్ధం చేయాలి. ఈ గ్లోబల్ సమ్మిట్ కు వివిధ దేశాల ప్రతినిధులను ఆహ్వానించండి. వివిధ దేశాల ప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో సెక్యూరిటీ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.' అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆపేదెవరు.. బీహార్‌లో నితీశ్ ఏకఛత్రాధిపత్యం..
బిహార్‌లో గెలుపు మాదే.. ఇక బెంగాల్‌లోనూ..: కేంద్ర మంత్రి
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..