Share News

TG CM Distributes Sarees: ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించనున్న సీఎం

ABN , Publish Date - Nov 18 , 2025 | 09:48 PM

రాష్ట్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీకి ప్రభుత్వం బుధవారం శ్రీకారం చుట్టనుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

TG CM Distributes Sarees: ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించనున్న సీఎం
TG CM Revanth Reddy Distributes Sarees

ఆంధ్రజ్యోతి, నవంబర్ 18: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి(Former PM Indira Gandhi)ని పురస్కరించుకుని బుధవారం రాష్ట్రంలో సీఎం రేవంత్ సర్కార్ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టనుంది. హైదరాబాద్ నగరంలోని నెక్లెస్ రోడ్డులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(TG CM Revanth Reddy) ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. కోటి మంది మహిళలకు చీరలను పంచడమే లక్ష్యంగా.. అర్హులైన ప్రతి స్త్రీకీ ఇందిరమ్మ చీర(Indiramma Saree)ను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


బుధవారం నాడు.. సెక్రెటేరియట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల మహిళలతో సీఎం మాట్లాడనున్నారు. అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. అయితే.. చీరల ఉత్పత్తి ఆలస్యం అవుతున్న కారణంగా.. ఉత్పత్తికి అనుగుణంగా రెండు దశలుగా ఈ పంపిణీ ప్రక్రియ చేపట్టనున్నారు. తొలి దశలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ నెల 19 నుంచి డిసెంబర్ 9న అనగా తెలంగాణా తల్లి అవతరణ దినోత్సవం వరకూ కొనసాగనుంది. రెండో దశలో 2026 మార్చి 1 నుంచి మార్చి 8 (అంతర్జాతీయ మహిళా దినోత్సవం - International Womens Day) వరకూ పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు చీరలను పంచనున్నారు.


ఇందిరమ్మ పంపిణీకి ఉపయోగించే చీరలను సిరిసిల్ల(Sirisilla)కు చెందిన చేనేత కార్మికులే తయారు చేస్తున్నారు. చీరల నాణ్యత విషయంలో రాజీపడకూడదన్న సీఎం.. పారదర్శకంగా పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కోటి మంది మహిళలకు కోటి చీరలను పంచాలనీ.. అర్హులైన ప్రతి స్త్రీకీ తప్పనిసరిగా ఇందిరమ్మ చీరను అందజేయాలన్నారు.


ఇవీ చదవండి:

అర్బన్ నక్సల్స్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

నిర్దేశించిన లక్ష్యం కంటే ముందే పూర్తికానున్న ఆపరేషన్ కగార్

Updated Date - Nov 18 , 2025 | 10:04 PM