Kavitha Allegations: బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా
ABN , First Publish Date - Sep 03 , 2025 | 12:51 PM
Kavitha Allegations: బీఆర్ఎస్ సస్పెండెడ్ ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్ చేశారు. హరీష్ రావు, సంతోష్ రావుపై షాకింగ్ ఆరోపణలు చేశారు. ప్రెస్‌మీట్‌లో కవిత ఏమన్నారంటే..
Live News & Update
-
Sep 03, 2025 21:54 IST
ఏపీలో ఏడుగురు ఐఏఎస్‌ల బదిలీలు, పోస్టింగ్స్
సర్వే సెటిల్‌మెంట్స్ & ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్‌గా రోణంకి కూర్మనాథ్
తూ.గో.జిల్లా జాయింట్ కలెక్టర్‌గా వై.మేఘస్వరూప్
గుంటూరు జాయింట్ కలెక్టర్‌గా అశుతోష్ శ్రీవాస్తవ
పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి
అల్లూరి జిల్లా పాడేరు ITDA ప్రాజెక్టు ఆఫీసర్‌గా తిరుమాని శ్రీపూజ
ఏపీ విజిలెన్స్ జాయింట్ సెక్రటరీగా కె.ఆర్.కల్పశ్రీ
విశాఖ జిల్లా రంపచోడవరం ITDA ప్రాజెక్టు ఆఫీసర్‌గా బచ్చు స్మరణ్‌రాజ్
ఆయా పోస్టుల్లో బదిలీ అయిన IASలు GADలో రిపోర్టు చేయాలని ఆదేశం
-
Sep 03, 2025 21:23 IST
రేపు కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలు పరిశీలన
హెలికాప్టర్‌లో తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ చేరుకోనున్న సీఎం
లింగంపల్లి కుర్దు ఆర్ అండ్ బీ బ్రిడ్జిని పరిశీలించనున్న సీఎం
బుడిగిడ గ్రామంలో పంట పొలాలను పరిశీలించనున్న రేవంత్ రెడ్డి
కామారెడ్డిలో దెబ్బతిన్న రోడ్లు, జీఆర్ కాలనీని పరిశీలించనున్న సీఎం
అనంతరం వరదనష్టంపై జిల్లా అధికారులతో సమీక్షించనున్న సీఎం
-
Sep 03, 2025 20:58 IST
బెంగళూరు టీడీపీ ఫోరానికి 12 ఏళ్లు పూర్తి
బెంగళూరు టీడీపీ ఫోరంను స్థాపించిన కనకమేడల వీరా
వేలాదిమంది సభ్యులతో 12 ఏళ్లుగా అనేక కార్యక్రమాలు
BTFకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారా లోకేష్
-
Sep 03, 2025 20:35 IST
ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం
క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ ప్రోత్సాహకానికి..
రూ.1500 కోట్ల కేటాయింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం
-
Sep 03, 2025 19:48 IST
హైదరాబాద్: భాగ్యనగరంలో ఘనంగా గణేష్ ఉత్సవాలు
జోరుగా కొనసాగుతోన్న వినాయక నిమజ్జనాలు
ఇప్పటివరకు GHMC పరిధిలో 1,21,905 గణేష్ విగ్రహాల నిమజ్జనం
ఈనెల 7న చంద్రగ్రహణం కావడంతో త్వరగా విగ్రహల నిమజ్జనం
ఈ నెల 6లోగా గణేష్ విగ్రహాలన్ని నిమజ్జనం చేసేందుకు సన్నాహాలు
-
Sep 03, 2025 18:56 IST
కవితకు BRS కౌంటర్
రేవంత్ కాళ్లకు హరీష్‌రావు మొక్కారనడం అబద్ధం: నిరంజన్‌రెడ్డి
రాజకీయాల కోసం ఇంత నీచమైన ఆరోపణలు చేస్తారా?: నిరంజన్‌రెడ్డి
కవిత ఆరోపణలను ప్రజలు నమ్మరు: నిరంజన్‌రెడ్డి
కేసీఆర్‌కు సంతోష్‌రావు వ్యక్తిగత సహాయకుడు మాత్రమే: నిరంజన్‌రెడ్డి
ఎవరి లాభం కోసం హరీష్‌రావును టార్గెట్ చేస్తున్నారు?: నిరంజన్‌రెడ్డి
కవితకు కష్టం వచ్చినప్పుడు హరీష్‌రావు సహా అందరం బాధపడ్డాం
ఎవరో చెబితే తప్పుదారి పట్టేంత బలహీనుడుకాదు కేసీఆర్: నిరంజన్‌రెడ్డి
కేసీఆర్‌ను ఎవరూ తప్పుదారి పట్టించలేరు: నిరంజన్‌రెడ్డి
కేసీఆర్ అలాంటి నాయకుడైతే తెలంగాణ సాధించేవారా?: నిరంజన్‌రెడ్డి
వ్యక్తిగత లబ్ధి కోసం ఆరోపణలు సరికాదు: నిరంజన్‌రెడ్డి
-
Sep 03, 2025 18:31 IST
BRS దగాకోరు పార్టీ: ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్
తెలంగాణ సెంటిమెంట్‌ను BRS దుర్వినియోగం చేసింది: మాధవ్
తెలంగాణ కోసం పోరాడిన BRS కల్వకుంట్ల అస్తిత్వంగా మారింది
పంపకాల్లో తేడాలే జరుగుతున్న ఎపిసోడ్‌కి కారణం: మాధవ్
అవినీతిమయమైన BRSలో కవిత ఎపిసోడ్ పరాకాష్ట: మాధవ్
బీజేపీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం: మాధవ్
వారసత్వ పార్టీలను బీజేపీ స్వాగతించదు: మాధవ్
కుటుంబమే పరమావాదిగా పనిచేసే పార్టీలు తాత్కాలికమే: మాధవ్
-
Sep 03, 2025 18:30 IST
BRS దగాకోరు పార్టీ: ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్
తెలంగాణ సెంటిమెంట్‌ను BRS దుర్వినియోగం చేసింది: మాధవ్
పంపకాల్లో తేడాలే జరుగుతున్న ఎపిసోడ్‌కి కారణం: మాధవ్
అవినీతిమయమైన BRSలో కవిత ఎపిసోడ్ పరాకాష్ట: మాధవ్
-
Sep 03, 2025 18:29 IST
BRS అనే పాములో కాలకూట విషం ఉంది: సీఎం రేవంత్‌రెడ్డి
ప్రజలను దోచుకున్న అనకొండ BRS: సీఎం రేవంత్‌రెడ్డి
రూ.లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తి ఇంట్లో కలహాలు మొదలయ్యాయి
పంపకాల్లో తేడాలు వచ్చి ఒకరినొకరు కొట్టుకుంటున్నారు: రేవంత్
అక్క, అన్న, చెల్లి, బావ ఒకరినొకరు కత్తులతో పొడుచుకుంటున్నారు
దోపిడీ సొమ్ము వాళ్ల కుటుంబంలో చిచ్చు పెట్టింది: సీఎం రేవంత్‌రెడ్డి
సంపాదించుకున్న టీవీలు, పేపర్ల కోసం కొట్టుకుంటున్నారు: రేవంత్
వాళ్లు వాళ్లు కొట్టుకుంటూ మాపై నిందలు వేస్తున్నారు: సీఎం రేవంత్
మీ పంచాయితీల్లోకి మమ్మల్ని లాగొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి
చచ్చిన పామును మళ్లీ చంపాల్సిన అవసరం మాకేముంది: రేవంత్
BRSను ప్రజలే బొందపెట్టారు: సీఎం రేవంత్‌రెడ్డి
-
Sep 03, 2025 18:17 IST
'ఎక్స్' ఖాతా బయోను మార్చుకున్న కవిత
కవిత 'ఎక్స్' ఖాతాలో MLC, BRS పదాలు తొలగింపు
మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి ఫౌండర్ అని రాసుకున్న కవిత
-
Sep 03, 2025 18:17 IST
హైదరాబాద్: నాంపల్లి కోర్టుకు హాజరైన నటులు నాగార్జున, నాగచైతన్య
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్టేట్‌మెంట్ రికార్డు చేసిన కోర్టు
-
Sep 03, 2025 18:11 IST
అమరావతి: ఇంటి ముంగిటకే చేనేత వస్త్రాలు
ఈ-కామర్స్‌లోకి అడుగుపెట్టిన ఆప్కో
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జియోమార్ట్‌తో అనుసంధానం
సంప్రదాయ వస్త్రాలు సహా రెడీమేడ్ చేనేత దుస్తుల అమ్మకం
నేరుగా వినియోగదారుల ఇళ్లకే డోర్ డెలివరీ
యువతను ఆకట్టుకునేలా రెడీమేడ్ చేనేత దుస్తులు
రోజురోజుకూ పెరుగుతున్న చేనేత వస్త్రాల వినియోగం
నేతన్నలకు 365 రోజుల ఉపాధే లక్ష్యం: మంత్రి సవిత
-
Sep 03, 2025 16:49 IST
అమరావతి: ఐదో రాష్ట్ర ఆర్ధిక సంఘం భేటీలో సీఎం చంద్రబాబు
బలహీనంగా ఉన్న స్థానిక సంస్థలకు ఊతమిస్తాం: చంద్రబాబు
ఆదాయార్జన ఆధారంగా పంచాయతీల కేటగిరీ: సీఎం చంద్రబాబు
ఆర్ధిక వనరులు పెంచుకునేలా ప్రత్యేక కార్యాచరణ: సీఎం చంద్రబాబు
పంచాయతీ రికార్డుల ఆన్‌లైన్‌కు డిప్యూటీ సీఎం సూచన
2025-29 కాలానికి రాష్ట్ర ఆర్ధిక సంఘం సిఫార్సులు
-
Sep 03, 2025 16:49 IST
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
410 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
135 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ
-
Sep 03, 2025 12:59 IST
పార్టీని హస్తగతం చేసుకోవాలనే కుట్ర జరుగుతోంది: కవిత
నేను ఏ పార్టీలో చేరను.. నాకు ఏ పార్టీతో పనిలేదు: కవిత
జాగృతి కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడాకే భవిష్యత్ కార్యాచరణ.
-
Sep 03, 2025 12:59 IST
BRS ప్రాథమిక సభ్యత్వానికి కవిత రాజీనామా
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత.
-
Sep 03, 2025 12:58 IST
సస్పెన్షన్‌పై కేసీఆర్‌ను ప్రశ్నించే అంతా పెద్దదాన్ని కాదు: కవిత
కానీ కేసీఆర్‌పై ఒత్తిడి తీసుకొస్తాను.
-
Sep 03, 2025 12:58 IST
నా 20ఏళ్ల జీవితం BRS, తెలంగాణ కోసం పనిచేశా
నాకు ప్రజలున్నారు.. వాళ్ల దగ్గరికే వెళ్తా.
బీఆర్ఎస్ ఉంటే ఎంత.. లేకుంటే ఎంత అని నేనలేదు.
కేసీఆర్‌కు నష్టం చేసే పార్టీ ఉంటే ఎంత.. లేకుంటే ఎంత అన్నాను.
సోషల్ మీడియాలో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
నా శరీరం బీఆర్ఎస్ అయితే.. నా ఆత్మ జాగృతి.
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా పనిచేశా.
BRSలో నా భాగస్వామ్యం ఏం లేదా?
హరీష్‌రావు, సంతోష్‌రావు భాగస్వామ్యం మాత్రమే ఉందా?
నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా.
-
Sep 03, 2025 12:57 IST
కేటీఆర్‌ను ఓడించేందుకు ప్రత్యర్థులకు హరీష్‌రావు డబ్బు పంపారు
పోచంపల్లికి మోకిలాలో వందల కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది.
అది అవినీతి సొమ్ము కాకుంటే తనకు గాడ్ ఫాదర్ సంతోష్ అని ఎమ్మెల్సీ నవీన్‌రావు అంటారు.
కేసీఆర్ పదవి ఇస్తే గాడ్ ఫాదర్ సంతోష్ ఎలా అవుతారు?
BRSను జలగల్లాగా హరీష్‌రావు, సంతోష్ పట్టిపీడిస్తున్నారు
మరోవైపు కాంగ్రెస్, బీజేపీతో ఇద్దరు అంటకాగుతున్నారు
సంతోష్‌రావు బాధితులు చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు
-
Sep 03, 2025 12:56 IST
నాకు పదవులపై ఆశ లేదు.. బయటకు వచ్చేశా: కవిత
ఇప్పటికైనా హరీష్‌రావు నక్కజిత్తులను కేటీఆర్ గమణించాలి.
హరీష్‌రావు చెవిలో జోరిగా లాంటివారు: కవిత
పార్టీలో జరిగే తప్పులన్నీ రామన్నపై మోపుతున్నారు.
దళితులు మరణించిన అంశంలో కూడా రామన్ననే డామినేట్ చేశారు.
-
Sep 03, 2025 12:56 IST
అధికారంలో ఉన్నా.. లేకున్నా.. నేను ఒకేలా ఉన్నా
అధికారంలో ఉన్నా.. నన్ను ప్రతిపక్ష ఎంపీగానే చూశారు.
ఆరడుగుల బుల్లెట్టే నన్ను గాయపరిచింది: కవిత
వీళ్లే ఇతర రాష్ట్రాలకు వెళ్తారు.. కుట్రలు చేస్తారు: కవిత
వీరివల్లే విజయశాంతి, మైనంపల్లి, ఈటల సహా ఎంతోమంది పార్టీని వీడారు.
ఉప ఎన్నికల్లో ఈటలను హరీష్‌రావే దగ్గరుండి గెలిపించారు: కవిత
ఈ విషయాలను కేటీఆర్ గుర్తించాలి: కవిత
-
Sep 03, 2025 12:55 IST
కేసీఆర్‌తో మొదటి నుంచి హరీష్‌రావు లేరు
టీడీపీ నుంచి బయటకు వచ్చే సమయంలో కూడా..
ఎందుకు ఈ నిర్ణయం అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు
హరీష్‌రావు ట్రబుల్ షూటర్ కాదు.. డబుల్ షూటర్
కేసీఆర్‌కు హరీష్‌రావు కట్టప్ప లాగా అంటారు..
హరీష్‌రావు ఒక దశలో తన పక్కన ఎమ్మెల్యేలను పెట్టుకోవాలని చూశారు
నా ప్రాణం పోయినా కేసీఆర్‌కు అన్యాయం జరగనివ్వను
నాపై ఇన్ని కుట్రలు, ఇన్ని అవమానాలు అవసరమా?
ఎన్నో జన్మల పుణ్యముంటే కేసీఆర్‌కు కూతురిగా పుట్టా
కేసీఆర్‌ను, పార్టీని నేనెందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటా?
-
Sep 03, 2025 12:54 IST
హరీష్‌రావు టార్గెట్‌గా ఎమ్మెల్సీ కవిత విమర్శలు
సీఎం రేవంత్, హరీష్‌రావు ఒకే విమానంలో ప్రయాణించారు: కవిత
రేవంత్ కాళ్లు హరీష్‌రావు పట్టుకున్నాకే ఈ కుట్రలు మొదలయ్యాయి
హరీష్‌రావుకు పాల వ్యాపారం ఉండేది: ఎమ్మెల్సీ కవిత
అధికారంలోకి రాగానే హాస్టళ్లకు పాలు సరఫరా చేశారని ఆరోపణలున్నాయి
రూ.లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని రేవంత్ అంటారు..
కానీ హరీష్‌రావు గురించి మాట్లాడరు.. కేసీఆర్‌ను మాత్రమే టార్గెట్ చేస్తారు
కేసీఆర్‌పై సీబీఐ విచారణ వచ్చిందంటే..
అందుకు కారణం హరీష్‌రావు, సంతోష్‌రావే: కవిత
-
Sep 03, 2025 12:54 IST
పార్టీని అస్తగతం చేసుకోవాలని కుట్రలు చేస్తున్నారు: కవిత
రేపు కేటీఆర్‌కు ఇదే జరుగుతుంది.
కేసీఆర్‌కు ఇదే జరుగుతుంది.
-
Sep 03, 2025 12:53 IST
కేటీఆర్ ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్నలు
కేటీఆర్‌ను గడ్డం పట్టుకుని అడుగుతున్నా: ఎమ్మెల్సీ కవిత
నాపై కుట్రలు జరుగుతుంటే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మీరు ఏం చేశారు?
నాపై కుట్రలు జరుగుతున్నాయని చెప్పినా కేటీఆర్ నుంచి ఫోన్ కూడా రాలేదు
మహిళా నేతలు కూర్చోని నాపై ప్రెస్‌మీట్ పెట్టారు: కవిత
అది మంచిదే.. అదే నేను కోరుకున్నది: ఎమ్మెల్సీ కవిత
పార్టీలో ఉండి పదవులు, డబ్బులు సంపాదించాలనుకున్నారు
కొందరు మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు
అందుకే నన్ను పార్టీ నుంచి బయటపడేశారు: కవిత
-
Sep 03, 2025 12:53 IST
పునరాలోచించండి..: కవిత
పార్టీ కోసం నేను చేసిన సేవలను నాయకత్వం పునరాలోచన చేయాలి
నేను మాట్లాడుతున్నది పార్టీకి వ్యతిరేకంగా కాదు: ఎమ్మెల్సీ కవిత
పార్టీలో ఉన్న కొందరు నాపై కక్షగట్టారు: ఎమ్మెల్సీ కవిత
సామాజిక తెలంగాణ కోసం కట్టుబడి ఉన్నా.. అది తప్పా?: కవిత
నేను ఏం తప్పుగా మాట్లాడాను.
సామాజిక తెలంగాణ అంటే BRS వ్యతిరేకం ఎలా అవుతుంది?: కవిత
-
Sep 03, 2025 12:51 IST
BRS నుంచి సస్పెన్షన్‌పై స్పందించిన ఎమ్మెల్సీ కవిత
లేఖలో రెండు అంశాలపై మాట్లాడాలనుకుంటున్నా: కవిత
రాష్ట్రంలో ఏ మూల సమస్య ఉన్నా స్పందించా: కవిత
10 నెలల వ్యవధిలో 42 నియోజకవర్గాల్లో పర్యటించా: కవిత
అక్రమ కేసుల్లో 5 నెలలు జైల్లో ఉన్నా: కవిత
బీసీ రిజర్వేషన్లు, పెన్షన్ల కోసం పోరాటం చేశా: కవిత