Share News

MLA Raja SIngh: ఒవైసీ అరుపులకు ఎవరు భయపడరు

ABN , Publish Date - Apr 06 , 2025 | 09:42 PM

MLA Raja SIngh: స్వాతంత్రం వచ్చినప్పటి భారత దేశం కాదు ఇదని.. ప్రస్తుతం ఇది మోదీ భారత్ అని ఎమ్మెల్యే రాజా సింగ్ అభివర్ణించారు. గతంలో రామ భక్తులు ఆలోచన, ఓర్పు తో ఉండేవారని గుర్తు చేశారు. కానీ అప్పుడు ఆలోచించినట్లు ఇపుడు వారు లేరన్నారు. అంతేకాదు.. ఏదైనా ఎదుర్కోడానికి వారంతా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.

MLA Raja SIngh: ఒవైసీ అరుపులకు ఎవరు భయపడరు
MLA Raja SIngh

హైదరాబాద్, ఏప్రిల్ 06: పార్లమెంట్‌లో వక్ఫ్ బిల్ పాస్ అయిందని ఒవైసీ బ్రదర్స్ గగ్గోలు పెడుతున్నారని గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యంగ్యంగా అన్నారు. ఆ బ్రదర్స్ అరుపులకు ఇక్కడ ఎవరు భయపడరని ఆయన పేర్కొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం గోషామహాల్‌లో ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. త్వరలో మోదీ.. భారత్‌ను హిందు రాష్ట్రంగా చేసే దిశగా కృషి చేస్తున్నారని చెప్పారు. మనమంతా ఐక్యంగా ప్రధాని మోదీకి అండగా నిలవాలని ఈ సందర్భగా ప్రజలకు ఆయన పిలుపు నిచ్చారు.

ముస్లింలను మోసం చేస్తున్న వ్యక్తి ఒవైసీ అని ఆయన అభివర్ణించారు. ఒక వైపు మోడీ, మరో వైపు యోగి ఇద్దరి వైపు దేశం మొత్తం చూస్తుందన్నారు. రామ్ మందిర్ నిర్మాణం జరగదని ఓవైసీ భావించారని రాజా సింగ్ చెప్పారు. కానీ శ్రీరామనవమి రోజు జనసంద్రాని చూసి ఒవైసీ కంగుతిన్నాడని పేర్కొన్నారు.


స్వాతంత్రం వచ్చినప్పటి భారత దేశం కాదు ఇదని.. ప్రస్తుతం ఇది మోదీ భారత్ అని ఆయన అభివర్ణించారు. గతంలో రామ భక్తులు ఆలోచన, ఓర్పు తో ఉండేవారని గుర్తు చేశారు. కానీ అప్పుడు ఆలోచించినట్లు ఇపుడు వారు లేరన్నారు. అంతేకాదు.. ఏదైనా ఎదుర్కోడానికి వారంతా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. గతంలో భారత్‌లో జిహాద్ పాతుకుపోయిందని.. కానీ మోదీ వచ్చిన తర్వాత ఎవరైనా జిహాద్‌కు పాల్పడాలంటే.. భయపడుతున్నారన్నారు. ఎందుకంటే జిహాద్‌కు పాల్పడితే ఇంట్లోకి బుల్డోజర్‌లు వస్తాయనే భయం వారిలో నెలకొందని చెప్పారు.


వక్ఫ్ బోర్డ్ బిల్ పార్లమెంట్‌లో పాస్ చేశారని గుర్తు చేశారు. వక్ఫ్ బోర్డ్ పేరు మీద ఎన్నో భూములు కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఎలాంటి పాత్రలు, రిజిస్ట్రేషన్ లేకుండా వక్ఫ్ భూములంటూ బోర్డులు పెట్టిన సందర్భాలున్నాయిని గుర్తు చేశారు. వక్ఫ్ బోర్డ్ రాక ముందు వాళ్ళకు 4 వేల ఎకరాల భూములు మాత్రమే ఉండేవని.. కానీ ఆ బోర్డును అడ్డం పెట్టుకొని దాదాపు 9 లక్షల 50 ఎకరాల భూములను కబ్జా చేశారన్నారు. ప్రధాని మోదీ బిల్లు తేవడం ముస్లింకు వ్యతిరేకంగా కాదని.. వారి నిజమైన భూములకు రక్షణ కల్పిస్తారని ఎమ్మెల్యే రాజా సింగ్ స్పష్టం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

HCU Land: హెచ్‌సీయూ వివాదంలో నిజాలు ప్రచారం చేయండి

No Exam: ఈ అర్హత చాలు.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. నెలకు రూ. 2 లక్షల జీతం

Water Conflict: నీటి పంచాయతీ.. అధికారులతో ఉత్తమ్ కీలక భేటీ

Healthy Soup: ఈ సూప్‌తో మీ శరీరంలో కొన్ని భాగాలకు ఊహించని శక్తి పక్కా

Cotton Clothing: కాటన్ దుస్తులు.. ఒరిజినలా? కాదా? ఎలా గుర్తించాలంటే..

Fake Cardiologist: ఏడుగురి ఉసురు తీసిన వైద్యుడు.. విచారణకు రంగం సిద్ధం

శ్రీలీలకి చేదు అనుభవం.. చెయ్యి పట్టుకుని లాగిన యువకులు

కేసు No.62.. సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ

For Telangana News And Telugu News

Updated Date - Apr 06 , 2025 | 09:42 PM